Begin typing your search above and press return to search.

సార్ ప్రెస్ మీట్ స్కిప్ చేయటానికి వెనుక అసలు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   28 May 2020 6:45 AM GMT
సార్ ప్రెస్ మీట్ స్కిప్ చేయటానికి వెనుక అసలు కారణం ఇదేనా?
X
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తన తీరుకు భిన్నంగా తరచూ ప్రెస్ మీట్లనునిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మాయదారి రోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భరోసా కల్పించేందుకు వీలుగా ఆయన తరచూ ప్రెస్ మీట్లు పెట్టటం.. పలు అంశాల్ని ప్రస్తావించటం తెలిసిందే. కేసీఆర్ ప్రెస్ మీట్ వింటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. దేశంలోనూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొన్న తాజా పరిణామాల్ని ప్రస్తావించటమే కాదు.. వాటికి సంబంధించిన విలువైన కామెంట్లను చేస్తుంటారు.

ఈ కారణంతోనే కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నంతనే దేశ విదేశాల్లోఉన్న వారు సైతం ప్రత్యేకంగా ఫాలో కావటం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి వేళలో ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది. తన తీరుకు భిన్నంగా చాలా తక్కువ వ్యవధిలోనే కీలక రివ్యూను పూర్తి చేసిన ఆయన.. హడావుడిగా చినజీయర్ స్వాములోరిని కలిసేందుకు వెళ్లిపోయారు. త్వరలో తాను స్టార్ట్ చేసే ప్రాజెక్టుకు హాజరుకావాలంటూ తానే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు.

ఇంతకీ ప్రెస్ మీట్ నుసారు ఎందుకు స్కిప్ చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. టీఆర్ఎస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ప్రెస్ మీట్ లో ఇబ్బందికర అంశాలకు సమాదానం చెప్పాల్సి ఉంటుందని.. తనకు అలవాటైన రీతిలో చూసిచూడనట్లుగా వదిలేయొచ్చు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించక తప్పని స్థితి.

అందుకే.. అలాంటి తలనొప్పులకు వీలుగా ప్రెస్ మీట్ నే ఎత్తేశారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిగా రిపోర్టర్లను తిట్టే తీరుపైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన పోతిరెడ్డి పాటు విషయం మొదలు.. రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు.. జీతాల కోత నిర్ణయంతో పాటు.. రోగ నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేపట్టాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించటం.. లాంటి పలు అంశాలు ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని.. ఇవన్నీ తలనొప్పిగా మారతాయన్న ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ ను స్కిప్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.