Begin typing your search above and press return to search.
రేపు హైదరాబాద్ లో జరిగే ఆ పెళ్లి సో వైరల్ ఎందుకైంది?
By: Tupaki Desk | 23 Dec 2021 12:30 PM GMTఆయనేం ప్రముఖుడు కాదు. అలా అని సెలబ్రిటీ కూడా కాదు. ఆ మాటకు వస్తే.. ఒక మామూలు వ్యక్తి. సొంతంగా కష్టపడి పని చేసుకొని పైకి వచ్చాడు. కాసిన్ని డబ్బులు సంపాదించాడు. బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఇంటిని.. ఇంట్లో వారిని సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటాడు. అలాంటి వాళ్లు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. కానీ.. అలాంటి వారిలో లేని ఒక కొత్త విషయం వారి జీవితంలో ఉంది. అదే వారిని ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా మార్చటమే కాదు.. వారి కుటుంబం గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవటమే కాదు.. వారింటికి ఫోన్ చేసి.. మీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కు మమ్మల్ని పిలవరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ వారింట్లో జరిగే వేడుక ఇప్పుడు వార్తగా ఎందుకు మారిందంటే.. పాతికేళ్ల ప్లాష్ బ్యాక్ కు వెళ్లాలి.
అతడి పేరు నాగిరెడ్డి. ఆమె పేరు సంస్కృత. హైదరాబాద్ లోని చంపా పేటకు చెందిన నాగిరెడ్డి పీఆర్ఆర్ లా కాలేజీలో చేరారు. ఏడాది తర్వాత వచ్చిన జూనియర్లలో వరంగల్ కు చెందిన సంస్కృతను చూడగానే ఆమె ప్రేమలో పడ్డారు. మొత్తానికి వారిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. వారి ఇళ్లల్లో పెళ్లికి ఒప్పుకునే పరిస్థితి లేదు. అందులోకి అమ్మాయి తరఫు ఇంట్లో ఒక రాష్ట్రస్థాయి నేత ఉన్నాడు. పెద్దలను ఒప్పించే పరిస్థితి లేకపోవటంతో.. చాలా జంటల మాదిరే ఎవరికి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ ను వదిలేసి.. సదూరాన ఉన్న ఒడిశాకు వెళ్లారు.
అక్కడి స్నేహితుడి సాయంతో పెళ్లి చేసుకున్నారు. చట్టబద్ధంగా దంపతులయ్యారు. ఇరు కుటుంబాల వారికి విషయాన్ని చేరవేశారు. తర్జనభర్జనల తర్వాత ఇరు కుటుంబాల వారు ఓకే చెప్పటం.. హైదరాబాద్ కు వచ్చి రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. కాలం వేగంగా పరుగులు తీసింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు. వారు యుక్తవయసుకు వచ్చారు. వారి.. అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా కాలం పాతికేళ్ల బంధాన్ని తీపిగుర్తుగా మారింది. అయినప్పటికీ అప్పట్లో తాము పెళ్లిని శాస్త్రబద్ధంగా చేసుకోలేదన్న లోటు మాత్రం మిగిలిపోయింది.
ఇటీవల వేదపండితులతో మాట్లాడే వేళలో.. తమ మనసులో మాట చెప్పటం.. పాతికేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా మంచి లగ్నంలో వారు మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
అందుకు ముహుర్తం రేపే (శుక్రవారం). శంషాబాద్ నర్కూడలోని అమ్మపల్లి రామాలయంలో ఈ జంట శాస్త్రోక్తంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేనా.. ఇప్పటి రోజున పెళ్లికి ముందు ఏమేం చేస్తున్నారో అవన్నీ చేస్తుండటం.. భారీగా బంధుమిత్రుల్ని ఆహ్వానించటం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఒక ప్రముఖ పత్రికలో పబ్లిష్ కావటంతో.. ఇప్పుడీ పెళ్లి హాట్ టాపిక్ గా మారి.. వైరల్ అయ్యింది. ఈ వార్తను చూసిన తర్వాత.. వారింటికి ఫోన్ చేసి.. మమ్మల్ని పెళ్లికి పిలవటం మిస్ అయ్యావ్ బాస్.. మాకు కార్డు పంపవా? అని అడుగుతున్నారట. మొత్తంగా పాతికేళ్ల అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా జరుగుతున్న పెళ్లి ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.