Begin typing your search above and press return to search.
తిరుమలలో ఈ హైదరాబాద్ కుర్రాడు ఎందుకింత హాట్ టాపిక్?
By: Tupaki Desk | 22 Dec 2020 7:25 AM GMTరోటీన్ కు భిన్నంగా.. పది మందిలోనే కాదు.. లక్ష మందిలోనూ ఒకే ఒక్కడిగా ఉండాలనుకోవటం.. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించేటోళ్లు చాలా.. చాలా అరుదుగా ఉంటారు. తాజాగా అలాంటి కుర్రాడు సోషల్ మీడియాలోనే కాదు.. వాట్సాప్ లోనూ ఇప్పుడు ఆసక్తికరంగా మారాడు. ఇంతకూ అతనేం చేశాడు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో ఒక యువకుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఉన్నారు. ఇంతకీ ఆ కుర్రాడి స్పెషల్ ఏమంటే.. పట్టు లుంగీ.. ఒంటికి కట్ బనీనుతో పాటు.. మెడలో భారీగా బంగారు గొలుసులు వేసుకోవటం.. ఒక చేతికి బంగారు కడియంతో పాటు.. గొలుసును కట్టుకున్న బంగారు చైన్ అందరిని ఆకర్షించింది. ఎందుకంటే.. అతడి ఒంటి మీద ఉన్న బంగారం ఏకంగా రెండు కేజీలు ఉండటమే కారణం.
ఏడు కొండలవాడిని దర్శించుకోవటానికి పసిడి కొండను ఒంటి మీద వేసుకున్న యువకుడి తీరు అందరి కళ్లు పడేలా చేసింది. ఇంతకీ.. ఈ యువకుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అన్న విషయాల్లోకి వెళితే.. ఆ కుర్రాడి పేరు రాహుల్ అని.. అతడిది హైదరాబాద్ గా తేలింది. అంత భారీగా బంగారం ఒంటి మీద వేసుకొని స్వామిని దర్శించుకున్న రాహుల్.. తిరుమల కొండ మీద సమ్ థింగ్ స్పెషల్ గా మారారు.