Begin typing your search above and press return to search.
కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత ఎందుకు? దానిని ఎలా నివారించాలి?
By: Tupaki Desk | 26 April 2021 12:30 AM GMTకొవిడ్ మహమ్మారి విజృంభణ దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సెకండ్ వేవ్ కారణంగా చాలామంది బాధితులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఊపిరి ఆడక మృతి చెందుతున్నారు. అయితే ఈ ఆక్సిజన్ కొరత ఎందుకు వస్తుంది? దానిని ఎలా నివారించాలో చూద్దాం.
మనిషి ఊపిరితిత్తులు పనిచేయడానికి నిమిషానికి సుమారు 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. మొత్తం శరీరానికి నిమిషానికి 250 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ కావాలి. ఊపిరితిత్తులు సరిగా లేకపోతే కావాల్సిన దానికన్నా అధిక పరిమాణంలో తీసుకుంటాయి. గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్తో కూడిన వాయువులు లోపలికి పోయి... కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ.
కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రక్రియకు అడ్డు పడుతుంది. ఊపిరితిత్తుల్లో మంటను కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలను గడ్డ కట్టేలా చేస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఇదే న్యూమోనియాకు దారితీస్తుంది. ఈ సమయంలోనే బయటి నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్సిజన్ శాచురేషన్ శాతం 90 కన్నా పడిపోయినప్పుడు వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సమక్షంలో ఆక్సిజన్ థెరఫీ అవసరం అవుతుంది.
సాధారణ సమస్యలు ఉన్న వారికి ఫేస్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే వారికి కచ్చితంగా ముక్కు నాళం ద్వారా ఇవ్వాలని వైద్యులు తెలిపారు. కొవిడ్ మెదటి దశలో 41.5 శాతం మందికి ఆక్సిజన్ అవసరం కాగా... రెండో దశలో 54.5శాతానికి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఆక్సిజన్ ట్యాంకర్లను వివిధ రాష్ట్రాలకు తరలించడానికి ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.