Begin typing your search above and press return to search.
బైడెన్ కు 17 ఓట్లు కావాలని న్యూయార్క్ టైమ్స్ ఎందుకు చెబుతున్నట్లు?
By: Tupaki Desk | 6 Nov 2020 3:15 AM GMTమెదడుకు మేత పెడుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. గడిచిన రెండు రోజులుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు విజయం ఎవరిదన్నది తేలకుండా సస్పెన్స్ తో చంపేస్తోంది. మరోవైపు ఓట్లు లెక్కింపు వడివడిగా సాగుతున్నా.. లెక్క పెట్టాల్సిన ఓట్లు లక్షల్లో ఉండటంతో.. గడియారంలో ముల్లు ఎంతలా తిరుగుతున్నా.. కొండలా పడి ఉన్నఓట్లు లెక్కింపు ఆలస్యమవుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మీడియాతో పాటు.. భారత్ లోని అన్ని మీడియా సంస్థలు ప్రకటిస్తున్న ఫలితానికి.. అమెరికాలోని ప్రఖ్యాత మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ ప్రకటిస్తున్న ఫలితానికి మధ్య అంతరం ఒకటి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి గెలవాలంటే.. అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే మేజిక్ ఫిగర్ కు ఎంత దూరంలో ఉన్నారన్న ప్రశ్నను అడిగితే.. తడుముకోకుండా 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరమని ఇట్టే చెప్పేస్తారు. భారత్ లోని పలు మీడియా సంస్థలు ఇదే అంకెతో ఉదరగొడుతున్నాయి. అయితే.. అందుకు భిన్నంగా ప్రఖ్యాత మీడియా సంస్థలు బీబీసీ.. ది న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థలు మాత్రం బైడెన్ కు మరో 17 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరమని స్పష్టం చేస్తున్నాయి.
ఎక్కువ మంది 6 ఓట్లు సరిపోతాయంటే.. బీబీసీ.. న్యూయార్క్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు 17 ఓట్లు అవసరమని ఎందుకు చెబుతున్నాయంటే.. దానికి కారణం ఫలితాల వెల్లడిలో పక్కాగా అధికారిక సమాచారాన్ని మాత్రమే వెల్లడించటమని చెప్పక తప్పదు. మన దగ్గర ఓట్ల లెక్కింపు వేళలో.. రెండు బాక్సులు టీవీ స్క్రీన్లలో కనిపిస్తాయి. అందులో అధిక్యం.. గెలుపు అనేవి ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితే ఉంది.
తాజాగా ఆరు సీట్లు అవసరమన్న వారంతా.. అధిక్యతను అసలు ఫలితంగా లెక్కేస్తే.. బీబీసీ.. న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థలు మాత్రం అధికారికంగా వెల్లడించిన గెలుపును మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రచురిస్తున్నాయి. దీంతో.. ఫాక్స్ న్యూస్ లాంటి సంస్థలు ఆరు ఓట్లు అవసరమన్న దాన్ని మనోళ్లు హైలెట్ చేస్తున్నారంతే.
లోతుల్లోకి వెళ్లి.. కచ్చితమైన ఫలితాలు అని చూస్తే మాత్రం బైడెన్ కు అవసరమైన ఓట్లు 17అయితే.. ట్రంప్ విజయం సాధించాలంటే.. 56 ఓట్లు అవసరమని చెప్పక తప్పదు. మన వాళ్లంతా 45 రాష్ట్రాల పలితాలు వెల్లడైనట్లు చెబుతుంటే.. బీబీసీ.. న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థలు మాత్రం ఇంకా ఆరు రాష్ట్రాల ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విషయం అర్థమైంది కదూ?