Begin typing your search above and press return to search.
ఏపీ డీజీపీపై హైకోర్టు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేసింది?
By: Tupaki Desk | 26 Jan 2021 3:23 AM GMTతరచూ వివాదాలు.. విమర్శల్ని ఎదుర్కొంటున్న ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తమకు తెలుసన్న హైకోర్టు.. ఈ సందర్భంగా కఠిన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి మరీ విచారణకు గైర్హాజరు అయ్యారన్న హైకోర్టు.. విచారణలో డీజీపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
‘‘న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి కాబట్టి.. కోర్టులు, న్యాయమూర్తులకు కళ్లు కనపడవని ఎవరూ అనుకోవద్దు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతుంటే.. ఎన్నికల విధుల్లో ఉన్నందున కోర్టుకు రాలేకపోతున్నానని డీజీపీ ఎలా చెబుతారు?’’ సూటిగా ప్రశ్నించారు జస్టిస్ బట్టు దేవానంద్. అసలీ పరిస్థితికి కారణం ఏమిటన్నది చూస్తే.. ఎస్ఐగా పని చేస్తున్న రామరావు సీఐగా ప్రమోషన్ కల్పించే ప్యానెల్ లో స్థానం కల్పించాలని హైకోర్టు గతంలో తీర్పును ఇచ్చింది. వాటిని అమలు చేయకపోవటంతో ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్.. డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఐజీ లడ్హాలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది.
దీంతో.. వారు గత నెల 29న హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. వారు సోమవారం (జనవరి 25న) కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. కోర్టుకు హాజరు కాకపోవటానికి చూపించిన కారణంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో తాను కోర్టు ముందుకు విచారణకు రాలేకపోతున్నట్లుగా విశ్వజిత్ చేసిన అభ్యర్థనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.
అందుకు భిన్నంగా ఎన్నికల విధుల కారణంగా ఫిబ్రవరి 27 వరకు డీజీపీ కోర్టుకు హాజరు కాలేరని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో డీజీపీ ఉన్నారని ఎలా చెబుతారని న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లో పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవన్న కోర్టు.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను రిజెక్టు చేస్తూ.. డీజీపీతో పాటు మహేశ్ చంద్ర లడ్హాకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేశారు.
అయితే.. డీజీపీ కోర్టు ఎదుట హాజరు కావటానికి మరో అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. కోర్టుకు హాజరు కాకపోవటానికి వారు పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేకున్నా.. వారు నిర్వహిస్తున్న పోస్టులను పరిగణలోకి తీసుకొని సోమవారానికి హాజరుకు మినహాయింపు ఇచ్చింది. తర్వాత వాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. చిన్న కారణాలతో హైకోర్టు చేత తలంటు పోయించుకున్న తీరు చూస్తే.. ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఏమిటన్న విషయంపై ఏపీ డీజీపీ కాస్త ఫోకస్ చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.