Begin typing your search above and press return to search.

సుదీప్ చర్యను ప్రకాష్ రాజ్ ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు?

By:  Tupaki Desk   |   6 April 2023 12:29 PM GMT
సుదీప్ చర్యను ప్రకాష్ రాజ్ ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు?
X
కన్నడ స్టార్ హీరో సుదీప్ నిన్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ను కలిసి తన మద్దతు బీజేపీకేనంటూ ప్రకటించారు. బీజేపీ తరుఫున ప్రచారం చేస్తాను కానీ.. పోటీచేయలేనంటూ వివరించారు. బొమ్మై తనకు చాలా సాయం చేశారని. ఆయన రుణం తీర్చుకుంటానంటూ ప్రకటించారు. అసలు బీజేపీ అంటేనే గిట్టని.. ఒంటికాలి పై లేచే ప్రకాష్ రాజ్ .. తాజాగా సుదీప్ నిర్ణయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించడం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు.

ప్రకాష్ రాజు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ 'కిచ్చా సుదీప్ ప్రకటనతో దిగ్బ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.' అంతకుముందు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్ రాజ్ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా.. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్ అమాయకుడేం కాదంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. కానీ ఆ అంచనాని తలకిందులు చేస్తూ బీజేపీ కి మద్దతు ప్రకటిస్తాడని అనుకోలేదని ప్రకాష్ అన్నారు.

తాను రాజకీయాల్లోకి చేరనంటూనే బీజేపీ తరుఫున ప్రచారం చేస్తారని.. సీఎం బసవరాజ్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వాడని.. ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడిని అంటూ సుదీప్ నిన్న చేసిన ప్రకటనపై ప్రకాష్ రాజ్ షాక్ అయ్యారు.

బీజేపీ అంటేనే విరుచుకుపడే ప్రకాష్ రాజ్ ఇలా కన్నడ స్టార్ హీరో గంపగుత్త గా బీజేపీ వెంట నిలవడాన్ని తప్పుపట్టారు. సుదీప్ ఏదైనా అలిగేషన్ తోనే ఇలా మద్దతు తెలిపారా? అన్న అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయం సరైంది కాదంటూ తాను తట్టుకోలేకపోతున్నట్టుగా చెప్పారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకంచే ప్రకాష్ రాజ్ ఆ పార్టీకి కన్నడ హీరోల మద్దతు అందుకే తట్టుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.