Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ను హర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్!
By: Tupaki Desk | 5 May 2019 5:15 AM GMTఈ మధ్య ఢిల్లీలో ప్రచార పర్వాన్ని సాగిస్తూ ఉన్నారు నటుడు ప్రకాష్ రాజ్. బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెట్ గా ఎంపీగా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ తను పోటీ చేసిన నియోజకవర్గానికి పోలింగ్ పూర్తి కావడంతో ఇతరుల కోసం ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ వివిధ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు మద్దతుగా ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే కన్హయ్య కుమార్ కు అనుకూలంగా కూడా ప్రచారం చేశాడు ప్రకాష్ రాజ్.
ప్రస్తుతం ఢిల్లీలో మకాం పెట్టాడు ఈ నటుడు. అక్కడ ప్రకాష్ రాజ్ ప్రచార పర్వం కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకే. మోడీ మీద అనేక రకాలుగా విరుచుకుపడ్డాడు ఈ నటుడు. అమిత్ షా పై కూడా ధ్వజమెత్తుతూ వచ్చాడు.
ఇక కర్ణాటక బీజేపీ నేతలను అయితే అనే అంశాల వారీగా ప్రకాష్ రాజ్ విమర్శిస్తూ వచ్చాడు. ఇలా బీజేపీ వ్యతిరేకే అయినా ఢిల్లీలో ఈ నటుడి ప్రచారం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతూ ఉంది.అదెందుకు అంటే..ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉండటం వల్ల!
ఢిల్లీలో ఆప్ కు మద్దతుగా తిరుగుతూ ఉన్నాడు ఈ నటుడు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు బెంగళూరులో తమ పార్టీ గుర్తు మీదే పోటీ చేయమని ప్రకాష్ రాజ్ ను కోరారు. అయితే అందుకు ఈ నటుడు తిరస్కరించాడు. తను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానంటూ అదే పని చేశాడు.
అయితే ఇప్పుడు ఆప్ తరపున ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో త్రిముఖ పోరు సాగుతూ ఉంది. బీజేపీ - ఆమ్ ఆద్మీ పార్టీ - కాంగ్రెస్ లు అమీతుమీ తలపడుతూ ఉన్నాయి. అలాంటి చోట ఈ నటుడు బీజేపీకి వ్యతిరేకంగా అంటూనే ఆప్ కు అనుకూలంగా ప్రచారం చేయడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది.