Begin typing your search above and press return to search.
పార్టీ ఎమ్మెల్యేను కేటీఆర్ అంతలా విసుక్కున్నారేంటి?
By: Tupaki Desk | 1 July 2023 9:45 AM GMTఎప్పుడూ కూల్ గా ఉంటూ.. తనను విమర్శించే అవకాశం ఇవ్వని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తొలిసారి అందరికి దొరికిపోయారు. ఆయన్ను టార్గెట్ చేసేలా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే.. ఆయన చేతిని విసిరికొట్టటం ఒక ఎత్తు అయితే.. ఆ పరిణామానికి షాక్ తిన్న సదరు ఎమ్మెల్యే.. మంత్రి కేటీఆర్ కు రెండు చేతులు జోడిస్తూ.. ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆయన్ను పెద్దగా పట్టించుకోని మంత్రి కేటీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అందరూ ఉన్నారు.. చుట్టూ కెమేరాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి మరీ.. గులాబీ ఎమ్మెల్యే ను కసరుకున్న వైనం చూసినోళ్లంతా విస్మయానికి గురవుతున్నారు. మంత్రి కేటీఆర్ ఇలా చేయటమా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో గిరిజనుల కు పోడు భూముల పట్టాల పంపి నీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో.. ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సభాస్థలి నుంచి స్టేజ్ మీదకు వచ్చే సమయం లో ఆయన ముందుకు అడుగులు వేస్తుంటే.. వెనుక నుంచి పరుగులు తీస్తూ వచ్చారు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్. మంత్రి కేటీఆర్ ను రిసీవ్ చేసుకునే విషయంలో ఆయన తప్పు కొంత జరిగింది. కేటీఆర్ వెనుక నుంచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయటం.. దీనికి బదులుగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చేతిని విసిరికొట్టిన వైనం కెమేరా కంటికి చిక్కింది.
ముఖంలో చిరా కు స్పష్టంగా కనిపిస్తున్న వైనం షాకింగ్ గా మారింది. అయితే.. పలు వివాదాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద బోలెడన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. ఆయన అలా రియాక్టు అయ్యారా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. మంత్రి కేటీఆర్ ప్రోగ్రాం కు హాజరయ్యే హడావుడి లో ఉన్నారని.. వెనుక నుంచి ఎమ్మెల్యే రావటం.. ఎవరో తన చేతిని టచ్ చేశారన్న భావన తో అలా రియాక్టు కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.