Begin typing your search above and press return to search.
దుబ్బాక బస్టాండ్ లో హరీశ్ ఎందుకంత ఆవేశానికి గురైనట్లు?
By: Tupaki Desk | 22 Oct 2020 7:00 AM GMTసవాళ్లు.. ప్రతిసవాళ్లు రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ.. ఒకే సవాలును అదే పనిగా ప్రస్తావించటం దేనికి నిదర్శనం? తాజాగా తెలంగాణలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అంతా తానై నడిపిస్తున్న మంత్రి హరీశ్ రావు.. నాలుగైదు రోజుల క్రితం ఒక సవాలు విసిరారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా బీడీ కార్మికుల పింఛన్లు.. కేసీఆర్ కిట్టు పథకానికి కేంద్రమే డబ్బులు ఇస్తుందన్న మాటల్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ధైర్యం ఉంటే.. వారు చెప్పిన మాటల్నినిరూపించాలని.. ఈ పథకాలకు కేంద్రం పైసా ఇచ్చినా తాను.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హరీశ్ నుంచి వచ్చిన సవాలుకు కమలనాథుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా దుబ్బాక బస్టాండ్ సెంటర్లో భారీ రోడ్ షోనునిర్వహించారు హరీశ్. అనూహ్యంగా ఈ రోడ్ షోకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావటంతో హరీశ్ ఉత్సాహం మరింత పెరిగింది.
తన ప్రసంగంలో పంచ్ లు పెంచటమే కాదు.. కాంగ్రెస్ కంటే.. బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హరీశ్. దుబ్బాక ప్రజల చైతన్యవంతులని.. బీడీ కార్మికులకు కేసీఆర్ సర్కారు ఇస్తున్న రూ.2016 మొత్తం రాష్ట్రమే ఇస్తుందని.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. తాము ఇస్తున్న మొత్తంలో 16పైసలు కూడా కేంద్రం ఇవ్వటం లేదని తేల్చిన హరీశ్.. మరోసారి బీజేపీ నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
అబద్ధాలు చెప్పిన బీజేపీ నేతలు ఏమయ్యారని..? తన సవాలును స్వీకరించే ధైర్యం వారికి లేదా? అని ప్రశ్నించారు. తన రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన మహిళల్ని చూసిన హరీశ్ తన మాటల్లో ఆవేశాన్ని పెంచటమే కాదు.. వారిని ప్రభావితం చేసేలా బీజేపీ నేతల మీద నిప్పులు చెరిగారని చెప్పాలి. మరి.. హరీశ్ మాటలు దుబ్బాక మహిళల మీద ఏ మేర ప్రభావితం చూపుతాయో.. ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.