Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై అశోక్ గజపతి రాజు ఎందుకు కోపంగా ఉన్నారు?

By:  Tupaki Desk   |   16 April 2021 4:30 PM GMT
చంద్రబాబుపై అశోక్ గజపతి రాజు ఎందుకు కోపంగా ఉన్నారు?
X
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎందుకు కోపంగా ఉన్నారు? పార్టీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన దూరంగా ఉండటం ద్వారా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల పరిషత్ ఎన్నికల సందర్భంగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కానీ పార్టీ ఆదేశాలను ధిక్కరించి అశోక్ గజపతిరాజు అభ్యర్థులను నిలబెట్టారు. అయన నిలబెట్టిన టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.

చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించాలన్న పిలుపుపై అశోక్ గజపతి రాజు సంతోషంగా లేరు. బాబు ఆదేశాలను ధిక్కరించి తన అభ్యర్థులను పరిషత్ ఎన్నికల్లో దింపాడు. కానీ ఇదే అశోక్ గజపతిరాజు కోపానికి మరో కారణం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరించాలన్న బాబు మాటను పెడచెవిన పెట్టడం పైకి మాత్రమే అని ఆయన సన్నిహితులు అంటున్నారు. టిడిపి బాస్ పట్ల అసంతృప్తిగా ఉండటానికి అశోక్ గజపతి రాజుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయని వారు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనను విస్మరించడమే కాదు.. అవమానించడమే అశోక్ గజపతిరాజు ఆగ్రహానికి కారణం అని అంటున్నారు. జిల్లా రాజకీయాల్లో అచ్చెన్నాయుడు వేలు పెట్టడం.. ఏ సమస్యపైనూ తనను సంప్రదించడం లేదని అశోక్ గజపతి గుర్రుగా ఉన్నాడట.. తనకు చాలా జూనియర్ అయిన పలువురు నాయకులకు అచ్చెన్న ప్రాధాన్యం ఇస్తున్నాడని.. తనను ఉద్దేశపూర్వకంగా విస్మరించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వీటన్నిటితో కలత చెందిన ఆయన చంద్రబాబు నాయుడు పిలిచిన పార్టీ మీట్‌ను బహిష్కరించడం ద్వారా తిరుగుబాటు జెండాను ఎగురవేశారని చెబుతున్నారు.

అశోక్ గజపతి రాజు క్లిష్టమైన ప్రతిపక్షంలో ఉన్న సమయాల్లో పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని గుర్రుగా ఉన్నాడట.. పార్టీ తనకు ఏమి సపోర్టు చేయడం లేదని భావిస్తున్నాడట.. అందువల్ల చంద్రబాబు నాయుడితో మాట్లాడటానికి .. సమావేశం కావడానికి దూరంగా ఉన్నాడని జిల్లాలో ప్రచారం సాగుతోంది.