Begin typing your search above and press return to search.
ట్రంప్ ఓడినా.. బైడెన్ గెలిచినా మనకొచ్చేది గుండు సున్నానే
By: Tupaki Desk | 6 Nov 2020 12:10 PM GMTకొన్ని కలలు.. ఆశలు చాలా చిత్రంగా ఉంటాయి. మనకు పది పైసలు ప్రయోజనం ఉండదు. కానీ.. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అదే పనిగా ఆసక్తి చూపించే కొన్ని అంశాల వల్ల మనకు కానీ.. దేశానికి కానీ ఎలాంటి లాభం ఉండదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల వారిని చూస్తే.. అదేదో తమ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల మాదిరి వ్యవహరిస్తున్న తీరు చూసతే.. విస్మయానికి కలిగించక మానదు. ఎవరొచ్చినా మనకే కాదు.. మన దేశానికి కొత్తగా వచ్చేది ఉండదు పోయేది ఉండదు. ట్రంప్ వస్తే.. మన పిల్లకాయలకు నాలుగు వీసాలుఎక్కువ వస్తాయని.. రెండు ఉద్యోగాలు అదనంగా లభిస్తాయన్న ఆశల్ని చిల్లర అంశాలే.
ఎందుకంటే.. అమెరికావోడి ఆలోచనలన్ని తాను.. తన దేశ ప్రయోజనాలు తప్పించి.. ఏ దేశం మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. అదే సమయంలో అకారణమైన ద్వేషం ఉండొచ్చు. దాంతో తన దగ్గరి ఆయుధాలు అమ్ముకోవటానికి.. చమురు మార్కెట్ ను విస్తరించుకోవటానికి.. మార్కెట్లను చేజిక్కించుకునే వ్యూహాలే తప్పించి.. తనదగ్గర పోగుపడిన అపార సంపదను.. సాంకేతికతను అప్పనంగా ఇచ్చే లక్షణం అసలే ఉండదు.
అధ్యక్ష పీఠం మీద ఈసారి బైడెన్ మాత్రమే కూర్చోవాలని తపించే వారిని.. ఆ తర్వాత జరిగేదేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పమంటే.. వెంటనే సమాధానం చెప్పక పోవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనమే పోటీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్న వారు లేకపోలేదు. తాము స్వయంగా ఓటు వేసే నాయకుడు.. తాము అభిమానించే అధినేత గురించి ఎంతలా ఫీల్ అవుతామో.. తాజాగా ట్రంప్.. బైడెన్ గురించి అశలు.. అంచనాలు ఇదే రీతిలో సాగుతున్నాయి.
ట్రంప్ గురించి ఇన్ని అనుకుంటాం కదా? అతగాడు మనకు చేసిన ద్రోహం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు దక్కకుండా చేస్తున్నాడు కదా? అన్న ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు పలువురు. మరి.. మన దగ్గర కూడా లోకల్ వారికే అధిక ప్రాధాన్యత.. వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని.. మన పాలకుల్ని మన డిమాండ్ చేస్తాం కదా. అదే తీరులో.. తనను ఎన్నకున్న అమెరికన్ల కోసం తన వారికి పెద్ద పీట వేయాలని ట్రంప్ అనుకుంటే తప్పేంటి?తెలంగాణలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని.. పక్క రాష్ట్రం వాడి ప్రయోజనాలు ఎందుకు చూడాలని నిలదీసినప్పుడు.. అమెరికావోడు అలా ఆలోచిస్తే తప్పేంటి? అన్నది ప్రశ్న.
ఇలా చూసినప్పుడు.. ట్రంప్ కానీ బైడెన్ కానీ ఇరువురికి అమెరికా.. దాని ప్రయోజనాలే ముఖ్యం. ఇరు పార్టీల అభ్యర్థులు సవాలచ్చ మాటలు అనొచ్చు.అదంతా రాజకీయం. చివరకు వారిద్దరికి ఉమ్మడి ఎజెండా మాత్రం తమ దేశ ప్రయోజనాలు.. తమను జాగ్రత్తగా చూసుకునే మార్కెట్ శక్తుల్ని ఎప్పటికప్పుడు సంతృప్తి పర్చటమే. జీర్ణించుకోవటానికి వీల్లేని ఇలాంటి మాటలు అప్రియంగా అనిపించినా.. వాస్తవం మాత్రం ఇదే. నిజం నిష్ఠూరంగా ఉండటం మామూలేగా?