Begin typing your search above and press return to search.

గూగుల్ కన్ఫ్యూజన్ ఎందుకు అంటే ఏపీ క్యాపిటల్ గురించి...!

By:  Tupaki Desk   |   23 Jan 2023 7:00 PM GMT
గూగుల్ కన్ఫ్యూజన్ ఎందుకు అంటే ఏపీ క్యాపిటల్ గురించి...!
X
గూగుల్ లో ఇపుడు అతి పెద్ద కన్ఫ్యూజన్ తో అలా కొనసాగుతోంది. ఎందుకు ఏంటి అంటే చాలానే కధ ఉంది. నిజానికి ఎవరికైనా ఏ విషయంలో అయినా కన్ఫ్యూజన్ ఉంటే కచ్చితంగా గూగుల్ తల్లికి మొక్కి అక్కడ తమ డౌట్లు అన్నీ తీర్చుకుంటారు. కానీ ఇపుడు గూగుల్ తల్లికే కన్ఫ్యూజన్ తెప్పించారు అంటే ఆ మ్యాటర్ మామూలుదా అన్న చర్చ సాగుతోంది.

అందరూ ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళ్ళి ప్రతీ విషయం విషయం మీద సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎంత సెర్చ్ చేసినా దొరకని మ్యాటర్ ఏదైనా ఉందంటే అదే అంటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే ఏపీ క్యాపిటల్ గురించే అంటున్నారు. ఎవరైనా ఔత్సాహికుడు ఏపీ పాలిటిక్స్ తెలియని వారు వెళ్లి గూగుల్ లో రాజధాని ఏది అని కొడితే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందిట. అక్కడ జవాబుగా ఏపీ క్యాపిటల్ పేరు రావాల్సింది పోయి రాజధాని మీద ఇప్పటిదాకా అంతా రాసిన ఏవేవో కధనాలు ప్రత్యక్షం అవుతున్నాయట.

తీరా చూస్తే అవన్నీ మీడియాలో వచ్చిన కధనాలే. అంటే ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని కొన్ని కధనాలు వస్తూంటే మూడు రాజధానులు అని మరి కొన్ని కధనాలు గత మూడేళ్ళుగా పుంఖానుపుంఖాలుగా వస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ఎవరి వెర్షన్ వారికి ఉంది. మరి ఈ వాదనలు కధనాలే జవాబుగా గూగుల్ తల్లి ఇస్తోంది అంటే పాపం ఎంతలా కన్ఫ్యూజన్ అయిపోతోందో కదా అనిపిస్తోంది

మరో వైపు చూస్తే గూగుల్ తల్లి ఇజ్జత్ కే సవాల్ గా పరువుకే చాలెంజిగా ఏపీ రాజధాని ఇష్యూ ఉందా అన్న డౌట్లు కూడా వస్తునాయట. నిజానికి గూగుల్ కొడితే జవాబు రాని పరిస్థితి ఉండదు. కానీ ఏపీకి మాత్రం రాజధాని లేక గూగుల్ ని సైతం కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు అని అంటున్నారు. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఏ దేశానికి కానీ ఒక రాజధాని ఏది అంటే ఠక్కున గూగుల్ తల్లి ఇట్టే చెప్పేస్తుంది. మరి ఈ భూగోళం మీద ఏ దేశం రాజధాని అయినా చెప్పే క్యాపాసిటీ ఉన్న గూగుల్ కి ఏపీ రాజధాని మాత్రం చిక్కు ప్రశ్నగా అతి పెద్ద కన్ఫ్యూజన్ గా మారిందా లేక మార్చేశారా అన్నదే ఇపుడు అంతా అంటున్న విషయం.

చిత్రమేంటి అంటే గూగుల్ కొడితే ప్రపంచంలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. తెలియని ఎన్నో తెలుస్తాయి. కానీ గూగుల్ నే అజ్ఞానంగా మార్చేసిన ఘనత మాత్రం ఏపీ రాజధానికి ఇక్కడ రాజకీయానికి ఉందంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అన్ని విషయాలు చెబుతున్న గూగుల్ ఏపీ రాజధాని అంటే మాత్రం కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతోంది.

సరే గూగుల్ తల్లికి ఈ విషయంలో ఏమీ తెలియదు అనుకుందాం. పాపం అంత పెద్ద జ్ఞాన సంపద ఉన్నా కూడా ఏపీ రాజధాని గురించి తెలియని అమాయకత్వం అనుకుందాం. కానీ ఏపీ జనాలకు అయినా తమ రాజధాని ఏదో తెలుసా అన్న ప్రశ్న వస్తోంది. ఏపీకి చెందిన వారు కానీ తెలుగు వారు కానీ ఇతర దేశాలలో స్థిరపడిన వారు అంతా కూడా ఇపుడు గూగుల్ ని కొట్టి మరీ తమ డౌట్లు తీరక అలా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు.

మీరు అక్కడే ఉంటున్నారు కదా ఏపీ రాజధాని ఏంటో మీకు అయినా తెలిస్తే మంచిం. మీరు జనరల్ నాలెడ్జిలో సూపర్ సక్సెస్ అయినట్లే అంటున్నారుట.మరి ఈ జననరల్ నాలెడ్జిలో ఏపీ జనాలు కూడా వెరీ పూర్ అని ఎలా చెప్పడం. ఆ విధంగా చేసిన పాలకులను చూసి ఏమనుకోవాలి అంటున్నారు. నాలుగేళ్ల పాలన కొద్ది నెలలలో పూర్తి చేసుకోబోతున్న వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో మాత్రం ఈ రోజుకీ కన్ఫ్యూజన్ అలా ఉంచేసింది అని అంటున్నారు.

ఇక్కడ మరో కీలకమైన మౌలికమైన ప్రశ్న కూడా వేసుకోవాలి. సరే గూగుల్ తల్లికి తెలియదు, ఏపీ జనాలు కూడా ఈ విషయంలో చీకట్లోనే ఉన్నారు. కానీ ఏపీ రాజధాని ఏంటి అన్నది ప్రభుత్వ పెద్దలకు అయినా తెలుసా మహానుభావా అంటే దానికి కూడా జవాబు లేదాయే రాదాయే. అంటే ఇది కదా అసలు సిసలు కన్ఫ్యూజన్ అని అనుకుంటే తప్పేముంది.

నాలుగేళ్ళు రాజధాని లేకుండా పాలిస్తున్న పాలకులను మెచ్చుకోవాలా లేక వారిని అలా భరిస్తున్న ప్రజల సహనానికి ప్రశంశలు కురిపించాలా లేక గూగుల్ తల్లినే ఓడించిన మన రాజకీయానికి జోహార్లు అర్పించాలా అంటే ఇది కూడా అతి పెద్ద కన్ఫ్యూజన్ గానే ఉంది మరి. టోటల్ గా అదండీ మ్యాటర్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.