Begin typing your search above and press return to search.
‘గంటా’కు వైసీపీలో గంట కొట్టలేదు అందుకేనా?
By: Tupaki Desk | 17 Aug 2020 9:30 AM GMTటీడీపీ మాజీ మంత్రి, విశాఖలో చక్రం తిప్పే నాయకుడు ‘గంటా శ్రీనివాసరావు’.. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో ఓ వైపు కేసుల భయం, మరో వైపు బిజినెస్ లు కాపాడుకోవడం కోసం వైసీపీలోకి జంప్ కావడానికి రెడీ అయ్యాడని ప్రచారం జరిగింది. ఆగస్టు 16న ఆయన వైసీపీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్టు వార్తలు వెలువడ్డాయి. తరువాత ఎందుకో వైసీపీ ‘గంట’ కొట్టకుండా ఆపేయడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది.
గంటాను వైసీపీలోకి ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియా ఆరాతీస్తే.. గంటా ఎప్పటివరకు ఎన్నికల్లో గెలవడానికి నాలుగు నియోజకవర్గాలు మారి అక్కడ పార్టీని బలోపేతం చేయకుండా తన బిజినెస్ లు చేసుకొని వైజాగ్ అంతా తన గుప్పిట్లో పెట్టుకొన్నాడని..మంత్రిగా ఉన్న సమయంలో అంతా తన మేనల్లుడు అయిన విజయ్ తో ట్రాన్సాక్షన్స్ చేపించి పెద్దఎత్తున గోల్ మాల్ చేశాడని ఈ మధ్య ప్రముఖ చానెల్ లో 30 మినిట్స్ ప్రోగ్రాం ఇచ్చిందట..
అది వైసీపీ హైకమాండ్ ఆరాతీస్తే గంటాకు మనం గంట కొడితే మనలను తినేస్తాడని దాదాపు నిర్ణయానికి వచ్చిందట.. అందుకే గంటాను వైసీపీ అధిష్టానం హోల్డ్ లో పెట్టేసిందని సమాచారం.
గంటా తన స్వార్థం కోసమే వైసీపీలో చేరుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. గంటాను రాకను ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకించారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం గంటాకు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.