Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ కేసు ఎందుకు మళ్లీ ఆగింది?

By:  Tupaki Desk   |   1 March 2023 5:00 AM GMT
ఫాంహౌస్ కేసు ఎందుకు మళ్లీ ఆగింది?
X
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వార్ లో కీలక కేసు 'బీఆర్ఎస్' ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఈ ఫైట్ లో ఇప్పుడు సీబీఐ చేతికి కేసు వెళ్లింది. కేంద్రం ఈ విషయంలో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి రెడీ అయ్యింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై బీఆర్ఎస్ పోరాడుతోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సీబీఐ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తదుపరి చర్యలపై ఆగుతున్నారు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఈనెల 6న తీర్పును వెలువరించింది.

వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ భావించింది.ఫైళ్లు, కేసు పూర్వాపరాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చింది. అయినా సీబీఐ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పిటీషన్ ను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు విచారించి మరోసారి వాయిదా వేసింది.

సోమవారం ఈ కేసుపై విచారణ జరిగింది కానీ కేసీఆర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఎప్పుడు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. సీజేఐ బెంచ్ ముందుకు దీన్ని రిఫర్ చేశారు. ఎప్పుడు విచారణ జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ కేసు సీబీఐ వద్దకు వెళితే బీజేపీకి ఫేవర్ గా సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ తరుఫు లాయర్ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అందుకే దూకుడు చూపించకుండా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే రంగంలోకి దిగాలని చూస్తున్నారు. అనవసర వివాదాలు రాకుండా ఉంటాయని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం మరో రకమైన చర్చ సాగుతోంది.

ఈ క్రమంలోనే సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తిరేపుతోంది. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చి 11 రోజులు గడిచిపోయాయి. అప్పటి నుంచి ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకూ వేచిచూస్తోంది. విచారణను ఈనెల 27కు వాయిదా వేయడంతో పది రోజుల పాటు సీబీఐ సైలెంట్ గా ఉంటుందా? ఫైళ్లను ఇవ్వాల్సిందిగా మరోసారి తెలంగాణ సీఎస్ కు లేఖ రాస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే సీబీఐ ఆరు సార్లు ఈ కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఇస్తామని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సీబీఐ తమకు కేసు ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ కేసు తమ చేతిలోకి వస్తే బీజేపీ పెద్దలను, అవసరమైతే అమిత్ షాకు కూడా నోటీసులు ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది. తన కూతురు కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ పెద్దల మెడకు ఈ కేసు చుట్టి వారిని ఇరికించేందుకు సిద్ధమైంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి రెడీ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.