Begin typing your search above and press return to search.
భూగోళం వేడెక్కుతోంది.. ఇలా అయితే మనుగడ కష్టమే..!
By: Tupaki Desk | 17 Dec 2020 9:30 AM GMTఅన్ని జీవ రాశులకు ఆవాసం భూగోళం ప్రస్తుతం భగ్గుమంటోంది. రోజురోజుకూ భూగోళం వేడెక్కుతుండడంతో జీవరాశుల మనుగడ కూడా కష్టంగా మారుతోంది. భూమిపై వాతావరణ కాలుష్యం పెరిగిపోతుండటం, మరొకవైపు వనరులు తరిగిపోవడం భూమి కి కడుపు కోతగా మిగుల్చుతున్నాయి. అభివృద్ధి పేరు చెప్పి భూమిని నిలువునా నాశనం చేస్తున్నారు. తాగే నీరు, పీల్చే గాలి, నివసించే నేల ఇలా ప్రకృతి వనరులన్నీ కాలుష్యం మారిన పడుతున్నాయి. భూగోళమంతా క్రమేణా పచ్చదనాన్ని కోల్పోతోంది. ఈ కారణంగా భూమికి రక్షణగా నిలిచే ఓజోన్ పొర కూడా దెబ్బతింటోంది.
భూగోళం ఉష్ణోగ్రత ఏటికేడు విపరీతంగా పెరుగుతున్నదని.. ఇలా అయితే మానవ మనుగడ కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషులు చేస్తున్న కాలుష్యం వల్లే ఇలా జరుగుతున్నదని వాళ్లు అంటున్నారు. భూగోళ ఉష్ణోగ్రతలు వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల కన్నా 0.3 ఫారిన్ హీట్ డిగ్రీ ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాల సంస్థ ‘హాడ్‌క్రుట్’ ఈ మేరకు అంచనావేసింది. హాడ్ క్రుట్ చేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీకి చెందిన వాతావరణ విభాగం 1850లో ఉన్న భూగోళ ఉష్ణోగ్రతల కన్నా 2010 నుంచి 18 వరకు భూమీ మీద ఉష్ణోగ్రత 1.90 ఫారిన్‌హీట్ డిగ్రీలు పెరగుతుందని హాడ్‌క్రుట్ అంచనా వేసింది.
నిజానికి భూతాపం 1.93 ఫారిన్‌హీట్ పెరిగింది. ఈ సారి కూడా హాడ్ క్రూడ్ అంచనాల్లో 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీల తేడా వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం అంచనా వేసిందని, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్ రీసర్చ్ యూనిట్ డైరెక్టర్ టిమ్ ఆస్‌బోర్న్ తెలిపారు. అయితే భూమిమీద ఇలా ఉష్ణోత్రలు పెరిగితే చాలా దుష్ప్రభావాలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొక్కలు పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడమే. మనముందున్న లక్ష్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.