Begin typing your search above and press return to search.

తల్లీ, బిడ్డను వేరు చేసే చట్టాలు మాకెందుకు.. ఫిలిప్పీన్స్ ప్రజల ఆగ్రహం

By:  Tupaki Desk   |   14 Oct 2020 11:10 AM GMT
తల్లీ, బిడ్డను వేరు చేసే చట్టాలు మాకెందుకు..  ఫిలిప్పీన్స్ ప్రజల ఆగ్రహం
X
ఫిలిప్పీన్స్ లో ప్రస్తుతం ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నది. ఆ దేశ న్యాయవ్యవస్థ పైనే ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఆందోళన చేయడం గమనార్హం. ఇటువంటి న్యాయవ్యవస్థ మాకొద్దంటూ ఆ దేశ ప్రజలు గొంతెత్తుతున్నారు. ఇందుకు వారి ఆగ్రహానికి కారణమేమిటో తెలుసుకుందాం.. జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ గర్భం దాల్చి ఇటీవల గర్భం దాల్చింది. అయితే ఆ దేశ చట్టాల ప్రకారం మూడునెలల పసికందును తల్లి నుంచి దూరం చేశారు అక్కడి పోలీసులు. అయితే తల్లికి దూరమైన ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడి న్యాయవ్యవస్థ, పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తల్లి బిడ్దలను కలిసి ఉంచాలని అనేక పిటిషన్లు వచ్చినప్పటికీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గత ఏడాది ఫిలిప్పీన్స్ లోని మనీలాలో మానవహక్కుల కార్యకర్త రీనా మే నాసినో ను అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే రీనా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని.. పోలీసులే ఆ ఆయుధాలను ఆమె వద్ద ఉన్నట్టు సాక్షాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె కమ్యూనిస్ట్​ అవడం వల్లే పోలీసులు అరెస్ట్​ చేశారన్న విమర్శలు వచ్చాయి. జైల్లో పరీక్షలు చేశాక.. 23 ఏళ్ల నాసినో గర్భవతి అని తేలింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. కొన్నాళ్ల తర్వాత అక్కడి చట్టప్రకారం తల్లీబిడ్డలను వేర్వేరుగా ఉంచారు. కాగా గతవారం ఆడ శిశువు చనిపోయింది. దీంతో ఫిలిప్పీన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లవెత్తాయి. న్యాయ వ్యవస్థ తీరును నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కారు.

కాగా మూడు నెలల తన కుమార్తె రివర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాసినోకు 3 రోజుల అనుమతి ఇచ్చారు జైలు అధికారులు. ఫిలిప్పీన్ చట్టాల ప్రకారం కస్టడీలో ఉన్న వారు తల్లి అయినపుడు మొదటి నెల రోజులు మాత్రమే బిడ్డ ఆమెతో ఉండవచ్చు. అయితే ప్రస్తుతం అటువంటి చట్టాన్నే మార్చాలంటూ ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.