Begin typing your search above and press return to search.

ఈ పొజిషన్ లోనే జంటలు ఎక్కువ ఎందుకు పడుకుంటారు? కారణమేంటి?

By:  Tupaki Desk   |   19 March 2023 2:00 PM GMT
ఈ పొజిషన్ లోనే జంటలు ఎక్కువ ఎందుకు పడుకుంటారు? కారణమేంటి?
X
రోజంతా పనిచేసి రాత్రిళ్లు నిద్ర లేకపోతే మరోరోజుకు అస్సలు బాగుండదు. ఆరోగ్యకరమైన శరీరానికి , మనసుకు నిద్ర చాలా అవసరం. ఈ నిద్రనే భాగస్వాముల మధ్య మంచి సంబంధానికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా స్లీపింగ్ పొజిషన్, స్లీపింగ్ పొజిషన్ సరిగా లేకపోతే భాగస్వామితో రిలేషన్ షిప్ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

మంచి నిద్ర ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి వరల్డ్ స్లీప్ డేను ప్రతీ ఏడాది మార్చి 17న జరుపుకుంటారు. తీవ్రమైన నిద్ర సమస్యలతో పోరాడుతున్న ప్రజలకు సహాయపడడం దీని ముఖ్య ఉద్దేశం.

ఈ దినోత్సవాన్ని 2008 నుంచి జరుపుకుంటున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం నినాదం మంచి నిద్ర, మెరుగైన జీవితాన్ని ఇస్తుంది.

జర్మనీలోని హైడెల్ బర్గ్ యూనివర్సిటీలో 31 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న జంటల స్లీపింగ్ పొజిషన్ పై ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డ్రీమ్ రీసెర్చ్ లో కూడా ప్రచురించబడింది. స్పూనింగ్, ఛేజింగ్ స్పూన్, బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్, క్రెడిల్, లెగ్ హగ్ వంటి జంటల మధ్య ఉపయోగించే నిద్ర భంగిమలను వీరు అధ్యయనం చేశారు.

చాలా మంది జంటలు ఇష్టపడే స్లీపింగ్ పొషిషన్ ఏంటంటే 'స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్'. 44శాతం జంటలు ఈ పొజిషన్ లోనే నిద్రపోవడానికి ఇష్టపడుతారట.. ఈ పొజిషన్ తో ఇద్దరి మధ్య గొడవలు తగ్గుతయాని.. మంచి గాఢ నిద్ర పడుతోందని జంటలు అధ్యయనంలో చెప్పారు. రిలేషన్ షిప్ బంధం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఈ పొజిషన్ లో ఇద్దరూ ఒకే దిశలో నిద్రపోతారు.

భాగస్వామి వెన నుంచి హగ్ చేసుకొని పడుకోవడాన్ని ఈ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో భాగస్వామిని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని పడుకుంటారు. ఈ స్పర్శ వల్ల భావోద్వేగ, శారీరక సౌకర్యాన్ని అందిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.