Begin typing your search above and press return to search.

డైపర్లతో వ్యోమగాములు.. ఏంటి దుస్థితి?

By:  Tupaki Desk   |   28 Nov 2019 11:52 AM GMT
డైపర్లతో వ్యోమగాములు.. ఏంటి దుస్థితి?
X
అంతరిక్షంలో వ్యోమగాములు అష్టకష్టాలు పడుతున్నారు. భూమి చుట్టూ తిరిగేలా భూమికి 400 కిలోమీటర్ల పైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించారు. అక్కడ మనుషులైన వ్యోమగాములు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ఈ స్పేస్ స్టేషన్ లో టాయ్ లెట్స్ చెడిపోయినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది. ఈ పరిణామంతో నింగిలో ఉన్న వ్యోమగాములు టాయ్ లెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అమెరికా మాడ్యూల్ లో ఒక టాయ్ లెట్, రష్యా మాడ్యూల్ లో మరో టాయ్ లెట్ ఉంది. వీటికి అదనంగా మరో రెండు టాయ్ లెట్లు స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నాయి.

అయితే భూమి చుట్టూ కదులుతున్న సమయంలోనే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఆగి ఉన్న సమయంలో తెలియక వినియోగిండంతో చెడిపోయాయి. తాజాగా నవంబర్ 25న అమెరికా మాడ్యూల్ లో ఉన్న టాయ్ లెట్ చెడిపోయిందని గ్రౌండ్ స్టేషన్ కు సమాచారం అందింది. రష్యా మాడ్యూల్ లో కూడా టాయ్ లెట్ దాదాపుగా నిండిపోయిందట..

చెడిపోయిన అమెరికా మాడ్యుల్ టాయ్ లెట్ ను మరమ్మతులు చేసే పనిలో వ్యోమగాములున్నారు. దీంతో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న 13 మంది వ్యోమగాములు డైపర్లు వాడుతూ అష్టకష్టాలు పడుతున్నారట.. టాయ్ లెట్ లో పేరుకుపోయిన నీరు బయటకు పంప్ చేయలేక పోతున్నట్టు గుర్తించారు. బయటకు నీరు పంప్ చేస్తే పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ప్రస్తుతం షటిల్ లో ఉన్న టాయ్ లెట్లను వాడుతున్నారట వ్యోమగాములు. మర్మమ్మతుల కోసం ఆరు రోజులు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇప్పుడు వారు డైపర్లతోనే కాలం గడుపాల్సి ఉంటుంది.

ఇక ఇదీ అతిక్రమిస్తే వ్యోమగాములు సూట్ లోనే మల, మూత్ర విస్తర్జన చేసేలా డిజైన్ చేశారు. ఆరు రోజుల పాటు దాంట్లోనే అన్నీ కానీచ్చేయచ్చుట.. ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పుడు టాయ్ లెట్లు చెడిపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడింది.