Begin typing your search above and press return to search.

ఏపీపై ఎందుకీ వివక్ష.. పార్లమెంట్ లో కడిగేసిన వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   11 Feb 2021 3:52 PM GMT
ఏపీపై ఎందుకీ వివక్ష.. పార్లమెంట్ లో కడిగేసిన వైసీపీ ఎంపీ
X
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబాబు పార్లమెంట్ లో కడిగేశాడు. కేంద్ర బడ్జెట్ లో రైల్వే జోన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని.. విశాఖ మెట్రోకు నిధులు కేటాయించలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారని.. అలాంటి ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ను మూడు దశల్లో పునరుద్దరించాలని ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారని.. ప్లాంట్ బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని.. రుణాలను ఈక్విటీగా మార్చాలని కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. సొంత గనులు కేటాయిస్తే ప్లాంట్ బతుకుతుందని.. స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్ష కుటుంబాలు జీవిస్తున్నాయని గుర్తు చేశారు.

దేశ ఆర్థిక సమస్యలకు జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ పరిష్కారం కాదని ఎంపీ సూచించారు. ఏపీలో వెనుకబడి జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ మాత్రమే కాదని.. ఏపీ ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్నామని తెలిపారు.ఏపీలో టీడీపీనేతలే ఆలయాల్లో విధ్వంసాలు చేశారని.. విగ్రహాలను కూల్చారని.. తమ వద్ధ ఆధారాలు ఉన్నాయని ఎంపీ సంచలన విషయాలు పార్లమెంట్ లో వెల్లడించారు.