Begin typing your search above and press return to search.
వైసీపీ హై కమాండ్ నుంచి ఎమ్మెల్యే... రామోజీరావుని ఎందుకు కలిశాడు...?
By: Tupaki Desk | 6 May 2023 1:03 PM GMTఏపీ రాజకీయాల్లో ఒక గాసిప్ అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అదేంటి అంటే వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే సడెన్ గా వెళ్లి మీడియా మొఘల్ అని పిలుచుకునే రామోజీరావు కుమారుడిని కలిశారు అన్నది. నిజంగా ఇది జరిగిందా. అసలు జరిగే అవకాశం ఉందా అన్నది ఆలోచించాల్సిన విషయమే.
అయితే రాజకీయాల్లో పుకార్లు ఉంటాయి. అలాగే అందులోనే వాస్తవాలూ ఉంటాయి. మరి ఇది ఏ విధంగా బయటకు వచ్చిందో తెలియది కానీ ఈ వీకెండ్ లో ఒక వైసీపీ ఎమ్మెల్యే అందునా అధినాయకత్వానికి తలలో నాలికగా చెప్పుకునే కీలక నేత హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళి రామోజీరావు తనయుడు కిరణ్ తో భేటీ వేశారు అని అంటున్నారు.
ఇది వైసీపీ అధినాయకత్వానికి తెలిసే జరిగిందా లేక ఆయనంతట ఆయన వెళ్లి కలిశారా అన్నది కూడా సందేహంగా ఉంది. అసలు ఈ భేటీ నిజమేనా అని కూడా సవాలక్ష సందేహాలు కలుగుతున్నాయి. రామోజీరావు తో వైసీపీ అధినాయకత్వానికి ఉప్పూ నిప్పూ లాంటి బంధం ఉంటున్న సంగతి తెలిసిందే.
పైగా సదరు మీడియా మీద వైసీపీ అధినాయకత్వం ఘాటైన విమర్శలు చేస్తూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈ భేటీ అన్నది వట్టి పుకారుగానే చూడాలి. అదే విధంగా ఆ ఎమ్మెల్యే వైసీపీ అధినాయకత్వానికి చాలా సన్నిహితుడు అని చెబుతున్న నేపధ్యంలో ఆయన పెద్దలకు చెప్పకుండా ఈ తరహా భేటీలు వేస్తారా అన్నది పెద్ద డౌట్.
అయితే ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందువల్ల దేన్ని కొట్టి పారేయడానికి లేదు. అలాగని పుకార్లుగా వచ్చి ప్రచారంలో ఉన్నవి కూడా నిజాలు అవాలని లేదు. ప్రత్యర్ధుల విషయంలో వైసీపీ అధినాయకత్వం పట్టుదల చూసినపుడు ఎక్కడా అందులో సడలింపులు మినహాయింపులు ఉంటాయని ఎవరూ అనుకోరు కూడా.
సో ఈ భేటీ నిజంగా జరిగి ఉండదని అంటున్న వారూ ఉన్నారు. ఒక వేళ జరిగిందే అనుకున్నా అది వ్యక్తిగత స్థాయిలోనే జరిగి ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు. మరి ఆ వ్యక్తిగత స్థాయిలో భేటీలు వేసేటంత పరిస్థితి సదరు ఎమ్మెల్యేలు ఉందా. ఆ భేటీ నిజంగా జరిగితే ఎవరి ప్రయోజనాల కోసం ఏ వైపు నుంచి ఏ వైపునకు ఆ చర్చలు జరిగి ఉంటాయన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏది ఏమైనా గత వీకెండ్ లో ఈ భేటీ జరిగిందని వస్తున్న పుకారు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది. నిప్పు లేనిదే పొగ రాదు. అందువల్ల నిజంగా నిప్పు ఉంటే పొగ వస్తుంది. లేకపోతే ఉత్త పొగతో మంచు తెరలా మబ్బులా కరిగి పోతుంది అంతే. ఇది జస్ట్ పొలిటికల్ గాసిప్ లా భావించి వదిలేయాల్సిందే అని అంటున్నారు.