Begin typing your search above and press return to search.

సీరం ఎందుకు వెనక్కి తగ్గింది.. తెర వెనుక ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   6 Jan 2021 7:30 AM GMT
సీరం ఎందుకు వెనక్కి తగ్గింది.. తెర వెనుక ఏం జరిగింది?
X
గడిచిన రెండు రోజులుగా సాగిన వ్యాక్సిన్ వార్ ఒక కొలిక్కి రావటం.. ఈ యుద్ధానికి తెర తీసిన ఫుణెకు చెందిన సీరం ఇనెస్టిట్యూట్ సీఈవో పూనావాలా వెనక్కి తగ్గటం.. రాజీకి భారత్ బయోటెక్ ను ఆహ్వానించటం.. అందుకు వారు ఓకే చెప్పటంతో ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలిసిందే. అయితే.. ఇదంతా జరగటానికి కారణం ఎవరు? తెర వెనుక ఏం జరిగింది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీరం సీఈవో చేసిన ప్రకటన.. అందుకు భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణ ఎల్లా కౌంటర్ పంచ్ కార్పొరేట్ వర్గాలతో పాటు.. చాలా చోట్లను తాకినట్లుగా తెలుుస్తోంది. భారత్ వ్యాక్సిన్ అంటే చులకనగా చూస్తున్నారా? మేం చేసిన ప్రయత్నాల్ని పట్టించుకోకుండా.. యూకే టీకాకు సంబంధించిన సమాచారం లేకుండానే అనుమతులు ఇచ్చారంటూ లోగుట్టు బయటకు రావటం కలకలంతో పాటు పెను చర్చకు దారి తీసింది.

సీరం తయారు చేసే వ్యాక్సిన్ వారి సొంతం కాదన్నది మర్చిపోకూడదు. వారికి ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకాలతో ఒప్పందంలో భాగంగా టీకా ఉత్పత్తికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. టెక్నికల్ గా సౌండ్ అయిన క్రిష్ణా ఎల్లా లాంటి వారు ఆవేదనతో చేసే ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత సీరం కంటే కూడా ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా మీదనే ఉంటుంది. ఇది అనవసర తలనొప్పితో పాటు..కొత్త సమస్యలకు కారణమవుతుంది.

ఇప్పటికే వ్యాక్సిన్ వినియోగంలో ఎదురవుతున్న సైడ్ ఎఫెక్టుల కారణంగా టీకా మీద నమ్మకాన్ని తగ్గిస్తున్న వేళ.. క్రిష్ణా ఎల్లా లాంటి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు అక్కడెక్కడో ఉన్న ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకాలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్న మాట వినిపిస్తోంది. సీరంది పోయేది తక్కువ. ఒకవేళ నష్టం జరిగితే అదంతా ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకాలకే అన్న మాట పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాక.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రచ్చ చేసుకుంటే అందరికి నష్టమే. ఎందుకంటే వ్యాక్సిన్ అవసరం.. దాని వ్యాపార పరిమాణం మామూలుగా లేదు. ఇలాంటప్పుడు బుద్ధిగా పని చేసుకోకకుండా కయ్యానికి కాలు దువ్విన సీరంకు భారీ ఎత్తున అక్షింతలు పడినట్లుగా చెబుతున్నారు. దీంతో దిగి వచ్చిన సీరం సీఈవో.. రాజీకి స్నేహ హస్తం చాటగా.. ఇలాంటి తలనొప్పులు తెగే వరకు లాగకూడదన్న విషయంపై క్రిష్ణ ఎల్లాకు క్లారిటీ ఉండటంతో..వివాదం కంచికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.