Begin typing your search above and press return to search.

మోడీ నోట ‘రెండుసార్లు’ మాట ఎందుకు వచ్చింది?

By:  Tupaki Desk   |   13 May 2022 5:11 AM GMT
మోడీ నోట ‘రెండుసార్లు’ మాట ఎందుకు వచ్చింది?
X
అవసరం లేకున్నా ఉత్తినే మాట్లాడే అలవాటు ప్రధానమంత్రి మోడీకి లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఇప్పటివరకు పూర్తిస్థాయి మీడియా సమావేశాన్నే నిర్వహించింది లేదు. ఈ విషయంలో మోడీతో పోలిస్తే.. మౌన ప్రధానిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ సైతం తన పదేళ్ల పదవీ కాలంలో పలుమార్లు మీడియా సమావేశాన్ని ఏడాదికి ఒకసారి చొప్పున నిర్వహించేవారు. మోడీ అలాంటిది కూడా చేయకపోవటం తెలిసిందే. తాజాగా ఆయన నోటి నుంచి తాను రెండుసార్లు దేశ ప్రధానిగా పని చేసినందుకు సంతృప్తి చెందనన్న విషయం ఆయన నోటి వెంట రావటం ఏదో సాదాసీదాగా చోటు చేసుకున్న పరిణామం కాదన్న మాట వినిపిస్తోంది.

మోడీ నోటి నుంచి వచ్చిన మాటల వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. కీలక స్థానాల్లో పదేళ్లు కొనసాగిన తర్వాత ఒక ధీమా వస్తుంది. కానీ.. మోడీలో అది కనిపించదు. 2014కు ముందు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న కోరిక ఆయనలో ఎంత బలంగా ఉందో.. ఇప్పుడు కూడా ఆ కుర్చీలో తానే కంటిన్యూ కావాలన్న కాంక్ష అంతేలా ఉందని చెప్పాలి. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. ఇటీవల తనను ఒక పెద్ద మనిషి కలిశారని.. తరచూ తనను విమర్శించే ఆయన.. తనతో భేటీ అయిన సందర్భంలో ఆయన చేసిన కామెంట్లను మోడీ బయటపెట్టారు.

రాజకీయంగా తనను నిత్యం విమర్శించే ఒక నేతను వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని.. ఆయనతో ఈ మధ్యన భేటీఅయినట్లుగా మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పదేళ్లు ప్రధానమంత్రిగా చేశారు.. ఇక చాలు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని.. కానీ అలా సర్దుకోవటం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు సంక్షేమ పథకాల్ని వంద శాతం అమలయ్యేలా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మోడీ తాజా వ్యాఖ్యల్నిచూస్తే.. మరికొన్నేళ్లు ప్రధానమంత్రి పదవిలోనే ఆయన కంటిన్యూ కావాలన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ మోడీ నోటి నుంచి ఈ తరహా మాటలురావటానికి కారణం ఏమిటి? అన్నది కూడా ఒక ప్రశ్నే. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సంఘ్ పరివార్ తో పాటు.. మరికొందరు బలవంతమైన బీజేపీ నేతల్లో మోడీకి బదులుగా మరో నేతను తెర మీదకు తీసుకురావాలన్నఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. ఈ విషయాన్ని గుర్తించిన మోడీ అండ్ కో.. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారి కాళ్లకు బంధనాలు వేసేందుకు వీలుగా మరోసారి అన్న మాటను ఆయన వాడి ఉంటారని చెప్పాలి. రెండుసార్లు ప్రధానిగా చేస్తేనే సంతృప్తి చెందే తీరు తనది కాదన్నమాట చెప్పటం ద్వారా.. వీలైనంత కాలం తానే కొనసాగాలన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చేశారని చెప్పాలి.

తనకు సలహా ఇచ్చిన వ్యక్తి గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానిమోడీ. ‘మోడీ మిగిలిన నేతలకు భిన్నమని.. గుజరాత్ నేలే నాకు ఆ ప్రత్యేకత ఇచ్చిందని ఆయనకు తెలీదు. అయిందేదో అయింది. ఇక అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుందామని తేలిక పడబోను. పథకాలు వందశాతం అమలై.. పూర్తి సంతృప్తికర స్థాయికి ప్రజల్ని చేర్చాలన్నది కల.

అది తీరేవరకు విశ్రమించను’’ అని చెప్పటం ద్వారా తన విజన్ ఎంత సుదీర్థమైనదన్న విషయాన్ని ఆయన సింఫుల్ గా తేల్చేశారని చెప్పాలి. సో.. 2024 మాత్రమేకాు.. 2029కూడా మోడీనే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో తేల్చేశారని చెప్పాలి.