Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు ఉన్నట్లుండి ఆ ఇష్యూ ఎందుకు గుర్తు వచ్చినట్లు?
By: Tupaki Desk | 17 Aug 2020 1:34 PM GMTహైదరాబాద్ మహానగరంలో నివసించే వారికి మాత్రమే కాదు.. హైదరాబాద్ సమస్యల్ని ప్రస్తావించే లోకల్ పేపర్లను ఫాలో అయ్యే వారందరికి కేంద్రం పరిధిలో ఉండే కంటోన్మెంట్ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి అవగాహన ఉంటుంది. ఢిపెన్సు ఆధ్వర్యంలో ఉండే ఈ ప్రాంతాల్లో ఉన్నట్లుండి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించటం.. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా దానికి పెద్దగా స్పందించకపోవటం.. స్థానికులు ఆందోళనలు నిర్వహించటం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి.
కంటోన్మెంట్ పరిధిలో పదే పదే రోడ్లు మూసివేత కారణంగా స్థానికులు పడే ఇబ్బందులపై తాజాగా మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు ఒక లేఖ రాయటం గమనార్హం. విధివిధానాల్ని పాటించకుండా స్థానిక మిలటరీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రోడ్లు మూసి వేయాల్సి ఉన్నా.. అలా చేయకుండా స్థానిక మీడియాలోనూ.. వెబ్ సైట్లలోనూ వివరాలు వెల్లడిస్తూ చేయటాన్ని తప్పు పట్టారు.
కోవిడ్ కారణాన్ని చూపిస్తూ..కంటోన్మెంట్ రోడ్లను మూసివేయటం సరికాదని.. మిలటరీ అధికారుల చర్యలతో హైదరాబాద్ లోని ఉత్తర.. ఈశాన్య ప్రాంతాల్లోని పది లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కంటోన్మెంట్ చట్టంలో వీధులుగా పేర్కొన్న రోడ్లనుమూసి వేయాలంటూ సెక్షన్ 258 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఇదంతా వినేందుకు బాగానే ఉన్నా.. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఇప్పుడే స్పందించటం ఏమిటి? దాని వెనుకున్న కారణాలు ఏమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది. ఆరేళ్లకు పైనే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారుకు.. మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కు కంటోన్మెంట్ ఏరియాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియంది కాదు. ఎప్పుడూ స్పందించని ఆయన.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు గరం గరమవుతూ లేఖ రాయటం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.