Begin typing your search above and press return to search.
కేసీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పి మరీ ఎందుకు ఆగింది?
By: Tupaki Desk | 6 April 2023 10:55 AM GMTపదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనూహ్యంగా అరెస్టు కావటం తెలిసిందే. టీఎస్సీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంలో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే బండి సంజయ్ పదోతరగతి ప్రశ్నాపత్రాల్ని లీక్ చేసిన ఉదంతంలో కీలక ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన్ను అనూహ్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు గంటల కొద్దీ సమయం ఆయన్నుపలు జిల్లాలకు తిప్పి.. వరంగల్ కు చేర్చటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తుఅయితే బండి ఉదంతం బుధవారం హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన ఈ ఎపిసోడ్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. సంచలన పరిణామం చోటు చేసుకున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ప్రెస్ మీట్ కు అత్యధిక ప్రాధాన్యత లభించింది.
అయితే ప్రెస్ మీట్ మొదట షెడ్యూల్ చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ వాయిదా వేసిన వైనం పై మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నోటుకు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ వేళలోనూ. ఉత్సాహంగా ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ ఆ సందర్భంగా తాను వెల్లడించిన వివరాలతో ఇబ్బందుల పాలు కావటం. తాను టార్గెట్ చేద్దామనుకున్న స్థానే తానే టార్గెట్ అయిన వైనం తెలిసిందే.
విచారణ సంస్థలకు తెలియాల్సిన సమాచారం ప్రభుత్వానికి ఏ రీతిలో వచ్చిందని? ముఖ్యమంత్రి స్వయంగా ఎలా ప్రకటిస్తారని? ఆయనకు ఆ సమాచారాన్నిఎవరు ఇచ్చారు? లాంటి మౌలిక ప్రశ్నలతో గులాబీ బాస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న దుస్థితి. ఇటీవల పేపర్ లీకేజీ ఎపిసోడ్ వేళలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తర్వాతి కాలంలో ఆయన్ను ఇబ్బందులకు గురి చేశాయి.
ఇలా ఒకటికి రెండుసార్లు కీలక వేళలో పెట్టిన ప్రెస్ మీట్లు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో. అదే విషయాల్ని కేసీఆర్ సన్నిహితుల సూచనతో వాయిదా పడిందన్న వాదన వినిపిస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి ఆ సందర్భంగా వెల్లడించిన వివరాలు తర్వాతి రోజుల్లో ప్రత్యర్థులకు ఆయుధంగా మారే వీలుకు చెక్ చెప్పేందుకే ప్రెస్ మీట్ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.