Begin typing your search above and press return to search.
రెండు రోజులకే సిద్దిపేట ఎయిర్ పోర్ట్ ను మర్చిపోయారేంటి కేసీఆర్?
By: Tupaki Desk | 13 Dec 2020 7:30 AM GMTగడిచిన మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. శనివారం ప్రధాని మోడీతో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసిన కేసీఆర్.. తెలంగాణకు ఆరు ఎయిర్ పోర్టులు ఇవ్వాలని కోరారు. కొత్త ఎయిర్ పోర్టుల గురించి హర్దీప్ తో చర్చలు జరిపిన ఆయన.. అందుకు సంబంధించిన లేఖను ఆయనకు అందజేశారు.
తెలంగాణలో తాము ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆరు ఎయిర్ పోర్టులకు సంబంధించిన డీపీఆర్ లను 2018లోనే సిద్ధం చేసి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సర్వే చేసినట్లుగా చెప్పారు. ఇంతకీ.. కేసీఆర్ కోరిన ఆరు ఎయిర్ పోర్టులు ఎక్కడ అన్నది చూస్తే.. కాసింత ఆశ్చర్యపడాల్సిందే. ఇంతకీ కేసీఆర్ కోరుకున్న ఎయిర్ పోర్టులు తెలంగాణలో ఎక్కడెక్కడా అన్నది చూస్తే..
1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ (ఇప్పటికే ఎయిర్ పోర్టు సెటప్ ఉంది)
2. వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్
3. అదిలాబాద్ జిల్లా
4. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి
5. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర
6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇదంతా బాగానే ఉంది కానీ.. మూడు రోజుల క్రితం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో.. సిద్ధిపేటలో ఎయిర్ పోర్టును తీసుకొస్తానని చెప్పిన పెద్దసారు.. తీరా కేంద్రమంత్రిని కలిసిన సందర్భంలో ఆ మాట చెప్పక పోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. వాస్తవానికి సిద్దిపేట జిల్లాలో ఎయిర్ పోర్టు ఆచరణ సాధ్యం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్మించే సమయంలో.. సదరు ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్ పోర్టు నిర్మించకూడదన్న నిబంధనను పెట్టుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని మర్చిపోయిన సీఎం కేసీఆర్.. తనకు అలవాటైన క్రమంలో హామీ ఇచ్చేశారని చెబుతున్నారు. తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. తాజా లేఖలో ఆరు ఎయిర్ పోర్టులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కోరిన కేసీఆర్.. సిద్దిపేట విషయాన్ని మాత్రం వదిలేశారని చెప్పాలి.