Begin typing your search above and press return to search.

గుంటూరు శ్రీనే నేరుగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు ఎందుకొచ్చాడు?

By:  Tupaki Desk   |   11 April 2021 4:30 AM GMT
గుంటూరు శ్రీనే నేరుగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు ఎందుకొచ్చాడు?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతంలో భూమా అఖిలప్రియ భర్త ప్రధాన అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు శ్రీను తాజాగా పోలీసులకు లొంగిపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సమీప బంధువులుగా చెబుతున్న వారిని ఒక భూవివాదంలో కిడ్నాప్ చేసి.. వదిలేయటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఎపిసోడ్ లో.. కిడ్నాప్ లో కీలకపాత్ర పోషించిన గుంటూరు శ్రీను కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం రెండు రాష్ట్రాల్లోనూ వెతికారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతని ఆచూకీ లభించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు స్వయంగా వచ్చి.. పోలీసులు ఎదుట హాజరయ్యాడు. ఎందుకిలా? అంటే.. ముందస్తు బెయిల్ కోసం అప్పీలు చేసుకున్న అతడికి.. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. సికింద్రాబాద్ ఆరవ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

ఇద్దరు వ్యక్తులు.. రూ.20వేల పూచీకత్తు సమర్పించటం.. ప్రతి శనివారం నిందితుడు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని.. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలన్న షరతుల్ని విధించింది. ఇందులో భాగంగా తాజాగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రీను.. ఈ నెల 8న ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు ఎదుట లొంగిపోయాడు. మొత్తానికి పోలీసులు పట్టుకోలేని గుంటూరు శ్రీను.. తనకు తానే బయటకు వచ్చిన పరిస్థితి.