Begin typing your search above and press return to search.
రాజకీయ రచ్చకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కారణమైంది ఎందుకు?
By: Tupaki Desk | 4 Jan 2021 7:47 AM GMTదేశంలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అందులో ఒకటి ఫూణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ వారిది. రెండోది హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కు చెందింది. ఇదిలా ఉంటే.. భారత్ బయోటెక్ టీకాకు అనుమతి రావటం రాజకీయ రచ్చగా మారింది. దీనికి ప్రధాన కారణం విపక్ష కాంగ్రెస్ పార్టీనే. భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు.. జైరామ్ రమేశ్.. ఆనంద్ శర్మలు తోడయ్యారు.
ప్రయోగాలు ముగియకుండానే అనుమతులు ఇవ్వటం ప్రమాదకరమని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కీలక అంశాన్ని రాజకీయం చేయటం ఏఅవమానకరమని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి ఫైర్ అవుతున్నారు. ఆయన మాటకు కాంగ్రెస్ నేతలు అస్సలు తగ్గట్లేదు. కొత్త పాయింట్లను తెర మీదకు తెస్తున్నారు.
‘ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదు’ అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మండిపడుతున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు ఇస్తున్నారని.. వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా అని ప్రశ్నిస్తున్నారు. ఆనంద్ శర్మ మాత్రమే కాదు.. శశిథరూర్ సైతం కోవాగ్జిన్ కు అనుమతి ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. కోవాగ్జిన్ కు పూర్తిస్థాయి పరీక్షలు పూర్తి అయ్యాక అనుమతులు ఇవ్వాలి.. అప్పటివరకు ఆగాలన్న సూచన చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరో మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సైతం కోవాగ్జిన్ కు అనుమతి ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. ‘ఆ వ్యాక్సిన్ కోసం నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? పూర్తిస్థాయి పరీక్షలు పూర్తి అయ్యే వరకు కోవిషీల్డ్ ను వాడుకోవాలి. కీలకమైన టీకా అంశంలో రూల్స్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది?’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్థవర్దన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కీలక అంశాల్ని రాజకీయం చేయటం అత్యంత ప్రమాదకరమన్న ఆయన.. ఇలా మాట్లాడి మీకు మీరుగా అభాసు పాలు అవుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి హర్షవర్దన్ కు తోడుగా మరో కేంద్రమంత్రి హర్ దీప్ పురీ నిలిచారు. ఒకప్పుడు సైనికుల త్యాగాల్ని ప్రశ్నించారని.. ఇప్పుడు స్వదేశీ టీకాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికి కాంగ్రెస్ కు గర్వకారణంగా అనిపించవంటూ పంచ్ లు వేశారు.