Begin typing your search above and press return to search.
విజయశాంతిని కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
By: Tupaki Desk | 29 Oct 2020 11:30 AM GMT‘ఉట్టికి ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందంట’.. అనేది తెలుగులో పాపులర్ సామెత. ఇప్పుడు తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విషయంలోనూ ఇదే సామెతను కొందరు నేతలు అప్లై చేస్తున్నారట.. అవును.. ఇప్పుడు విజయశాంతి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉండి కూడా దుబ్బాకలో ప్రచారానికి పోలేదు. మరోవైపు ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా విజయశాంతి ఇంటికెళ్లి మరీ బీజేపీలో చేరాలని సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే తేరుకున్న పీసీసీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి విజయశాంతిని బుజ్జగించారు. దీంతో మెత్తబడ్డ విజయశాంతి సోషల్ మీడియాలో దుబ్బాకలో టీఆర్ఎస్ దురాగతాలను ఎండగడుతూ నిన్న ట్వీట్ చేశారు. కింద ‘కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్’ అని రాసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక రాములమ్మ కాంగ్రెస్ లో ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అసలు విజయశాంతిని రాజకీయ పార్టీలు ఎక్కువగా ఊహించుకుంటున్నాయా? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
లేడీ సూపర్‌స్టార్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌డమ్ సంపాదించిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత బీజేపీ పార్టీలో చేరారు. అక్కడి నుంచి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అయ్యారు.
అయితే.. చాలా కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో అంత పెద్దగా యాక్టివ్ రోల్స్‌లో పోషించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ముఖ్యులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లో ఉన్నప్పుడు మెదక్ ఎంపీగా గులాబీ పార్టీ బలంతో గెలిచారు విజయశాంతి. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాక మెదక్ ఎంపీ, మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేసి రెండు సార్లు ఓడిపోయారు. మెదక్ జిల్లాలో అసలు విజయశాంతికి ఓట్లు లేవు.. క్యాడర్ కూడా లేని పరిస్థితి ఇప్పుడు నెలకొందని నేతలు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతి వల్ల లాభం లేదనుకొని వదిలేసినట్టు టాక్ ఉంది. ఇటీవల దుబ్బాక ఎన్నికల ప్రచారానికి కూడా విజయశాంతిని పెద్దగా కాంగ్రెస్ పట్టించుకోలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో విజయశాంతి కూడా వారి వైఖరి నచ్చక సైలెంట్ గా ఉంది.. అందుకే గాంధీ భవన్ తోపాటు దుబ్బాక వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల మీటింగ్‌లోకూ అటెండ్ కావడం లేదు.
దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటున్నాయి. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి అదే పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేస్తే గెలుస్తుందా లేదా అన్నది కాంగ్రెస్ వర్గాలు సమాలోచనలు చేశాయి. దుబ్బాక నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలోనూ ఇదే అంశం హాట్ టాపిక్ లా మారింది. అయితే దుబ్బాక లో విజయశాంతి పోటీచేస్తే గెలిచే చాన్స్ లేదని ఆ నియోజకవర్గ నేతలు కుండబద్దలు కొట్టారట.. క్యాడర్, బలం లేని ఆమెకు టికెట్ ఇస్తే తాము సహకరించమని అన్నట్టు ప్రచారం సాగింది. సొంత మెదక్ అసెంబ్లీలోనే గెలవని విజయశాంతి దుబ్బాక లో ఎలా గెలుస్తుందని వారంతా వ్యతిరేకించారట. దీంతో దుబ్బాక సీటు విజయశాంతికి ఇవ్వకుండా అక్కడి టీఆర్ఎస్ నేతను లాగేసి ఇచ్చారట..
ఈ పరిణామాలతో అలక మీద ఉన్న విజయశాంతి దుబ్బాక ఎన్నికలకు దూరంగా జరిగారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆమెకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువే ప్రాముఖ్యతను ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆమెకు మెదక్ జిల్లాలో క్యాడర్, ఫాలోయింగ్, ప్రజాబలం లేదని తెలిసి పట్టించుకోవడం లేదని.. అదే విజయశాంతి అలకకు కారణమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి ఇది నిజమా? లేక వట్టిప్రచారమా అన్నది తేలాల్సి ఉంది.