Begin typing your search above and press return to search.
బంద్ చేయించిన పెద్ద మనిషి.. ఢిల్లీకి వెళ్లి రైతులు కలిసి రాకపోవటమేమిటి?
By: Tupaki Desk | 14 Dec 2020 9:30 AM GMTఅవ్వా కావాలి బువ్వా కావాలి అంటే అన్నిసార్లు నడవదు. ఆ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగానే అర్థమైనట్లుంది. ఎత్తులు వేయటంలో తనకు మించిన మాస్టర్ మైండ్ ఉండదని భావించిన ఆయనకు.. బీజేపీ అధినాయకత్వం కదుపుతున్న పావులు ఇబ్బందికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న తీరు ఆయనకు మింగుడుపడటం లేదంటున్నారు.
తప్పుల మీద తప్పులు చేసేలా కేసీఆర్ ను కమలనాథులు ప్రేరేపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. బీజేపీ గేమ్ ప్లాన్ లో కేసీఆర్ చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. ఓవైపు ప్రజల్లో ప్రతికూలత.. మరోవైపు అంతకంతకూ బలపడుతున్న బీజేపీ.. ఇవి సరిపోవన్నట్లుగా.. కేసులు పెట్టేందుకు వీలుగా కేంద్రం పావులు కదుపుతుందన్న సందేహం.. వెరసి తీవ్రమైన ఒత్తిడిలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. అందుకు భిన్నంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ కు దూరంగా ఉండకుండా రైతులకు సంఘీభావాన్ని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సిద్దించిన తర్వాత ఇప్పటివరకు ఏ సమస్య మీదా నిరసన తెలిపేందుకు రోడ్ల మీదకు రాని టీఆర్ఎస్ నేతలు తాజాగా భారత్ బంద్ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహించారు. ఇంత జరిగిన తర్వాత గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. పలువురు కేంద్రమంత్రుల్నికలిశారు. తెలంగాణ ప్రభుత్వ వినతుల్ని వారికి అందజేశారు.
ఇన్నిపనులు చేసిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ శివారులో ఆందోళన చేస్తున్న వారి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదన్న మాట వినిపిస్తోంది. కేంద్రానికి కోపం రాకూడదన్న ఉద్దేశంతో రైతుల్ని కలవటం తర్వాత.. ఆ అంశంపై తనకున్న అభ్యంతరాల్ని కూడా ఢిల్లీ మీడియాలో మాట్లాడకపోవటం గమనార్హం. ఇదంతా చూసిన వారు ఓవైపు రైతుల పోరాటానికి అనువుగా భారత్ బంద్ ను చేయించిన కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి .. మూడు రోజులు ఉండి కూడా రైతుల ఆందోళన మీద మాట్లాడకపోవటం కచ్ఛితంగా ఆయనకు డ్యామేజ్ చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అన్ని తెలిసిన పెద్దమనిషి.. ఇలాంటి తప్పులు చేయటం ఏమిటి చెప్మా?