Begin typing your search above and press return to search.

బాబూ.. ఈ మౌనమేలనోయి ?

By:  Tupaki Desk   |   9 Dec 2018 7:16 AM GMT
బాబూ.. ఈ మౌనమేలనోయి ?
X
నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డే కాదు. ఆంధ్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రే కూడా. అంతే నా అంటే అది కాదు. దేశంలోనే రాజకీయ నాయకులలో సీనియర్ (?) నాయకుడు. ఇది ఒక్కటకేనా తెలంగాణ ముందస్తు ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ని గద్దె దించేందుకు ప్రజాకూటమి ని ఏర్పాటు చేసిన నాయకుడు. దశాబ్దాల కాంగ్రెస్‌ తో వైరాన్ని పక్కన పెట్టి రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చాటిన నాయకులు. ఇన్ని విశిష్టతలు ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలు ముగిసినా ఫలితాల పై మాత్రం పెదవి విప్పడం లేదు. పాపం ఎందుకో!

ఎన్నికల అనంతరం చంద్రబాుబు నాయుడు తన రాష్ట్రాని కి వెళ్లిపోయారు. అక్కడి పాలన వ్యవహారాలలో తలమునకలయ్యారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్- సీపీఐ- తెలంగాణ జన సమితితో జత కట్టినందుకు విశ్వప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. ప్రజాకూటమి అభ్యర్దుల విజయానికి తన వంతు ప్రచారాన్ని చేసారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో కలసి రోడ్‌ షో లలో, బహిరంగ సభలలో పాల్గొన్నారు. ప్రజాకూటమి అభ్యర్దుల విజయం చారిత్రక అవసమంటూ ప్రచారం చేసారు. వీలున్నంత వరకూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించారు.

ఈ నెల 7 వ తేదీన తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఈనెల 11 వరకూ అభ్యర్దుల భవితవ్యం ఈవీఎం లలో నిక్షిప్తం అయ్యి ఉంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తో పాటు కాంగ్రెస్- తెలంగాణ జన సమితి- సీపీఐ నాయకులందరూ తమ విజయావకాశాల పై ప్రకటనలు చేస్తున్నారు. ఎవరికి వారే వారి వారి లెక్కలు వేసుకుంటున్నారు.

రాజకీయాలలో విశేష అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు మాత్రం మౌనంగానే ఉన్నారు. దీని వెనుక మౌనంగానే ఉండమని ఏ మొక్కైనా చెప్పిందా అని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది. పోల్ మేనేజ్‌మెంట్‌ లోను పోలింగ్ అనంతరం ఫలితాల విశ్లేషణలో ను చంద్రబాబు నాయుడి కి విశేష అనుభవం ఉంది. అయితే పోలింగ్ ముగిసి రెండు రోజులు గడచినా చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణ ఫలితాల పై మౌనంగానే ఉన్నారు. ఈ మౌనం ప్రజాకూటమి ఓటమి కి అర్థాంగీకారమా లేక ఫలితాల పై గుంభనంగా ఉండడమా అని తేల్చలేకపోతున్నారు. ఇదే విషయం పై తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా మౌనజపాన్నే చేస్తున్నారు. ఎవరు- ఎక్కడ ఎలా గెలుస్తారో లెక్కలతో సహా చెప్పే సమర్థత ఉన్న బాబు మౌనంగా ఉన్నాడంటే... కూట‌మి ఇక స‌ర్దేయాల్సిందేనేమో!