Begin typing your search above and press return to search.
రాయపాటి దోపిడిపై ఎందుకు మాట్లాడటం లేదబ్బా ?
By: Tupaki Desk | 24 Dec 2020 4:15 AM GMTమాజీ ఎంపి, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు భారీ దోపిడి విషయం సంచలనంగా మారింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం రాయపాటి కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ రూ. 7153 కోట్ల కుంభకోణం కలకలం రేపుతోంది. కెనరాబ్యాంకు ఆధ్వర్యంలో 14 బ్యాంకుల కన్సార్షియం రాయపాటికి రూ. 7153 కోట్ల అప్పులిచ్చి ఇపుడు ముణిగిపోయాయి. రాయపాటికి ఇచ్చిన వేలకోట్ల రూపాయల అప్పులంతా బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల కష్టార్జితమే అన్న విషయాన్ని మరచిపోకూడదు.
సరే నకిలీ కంపెనీలు పెట్టడం, ప్రభుత్వాల నుండి భారీ కాంట్రాక్టులను దక్కించుకోవటం, అందుకోసమని బ్యాంకుల్లో లోన్లు తీసుకుని తర్వాత అప్పులిచ్చిన బ్యాంకులను ముంచేయటం అన్నది ఇపుడు కొత్తగా ట్రెండుగా నడుస్తోంది. ఒకపుడు ఎక్కడో ఒకటి అరా కంపెనీలు మాత్రమే చేసే పనులను ఈమధ్య చాలా కంపెనీలు చేస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే రాయపాటి వేలకోట్ల రూపాయల దోపిడిపై తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయమే అర్ధంకావటం లేదు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన కార్పొరేట్ కంపెనీ ప్రముఖుల్లో రాయపాటి కూడా ఉన్నారు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రయిన తర్వాతే రాయపాటి దోపిడి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిందని రికార్డుల మూలకంగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాయపాటి చేస్తున్న దోపిడి వ్యవహారం చంద్రబాబుకు తెలీకుండా జరిగిందని అనుకునేందుకు కూడా లేదు. నిజానికి రాయపాటి కుంభకోణం టీడీపీ అధికారంలో ఉన్నపుడే బయటపడింది. అప్పట్లో ఇన్ని విషయాలు వెలుగుచూడలేదు. కానీ తాజా రాయపాటి కుంభకోణం వెలుగుచూసిన తర్వాత అయినా చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు ?
చంద్రబాబనే కాదు యావత్ టీడీపీ నేతల్లో ఎవరు కూడా ట్రాన్స్ ట్రాయ్ కుంభకోణంపై మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. టీడీపీ నేతల వ్యవహారం ఎలాగుందంటే అసలు రాయపాటి ఎవరో కూడా తమకు తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు రాయపాటి కుంభకోణంలో చంద్రబాబుకు వాటాలున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు ఎదురుదాడులు చేస్తున్నారే కానీ రాయపాటి దోపిడిపై మాత్రం మాట్లాడటం లేదు.