Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు సెంట్రల్ టీం ఎందుకు వస్తోంది?

By:  Tupaki Desk   |   25 April 2020 5:00 AM GMT
హైదరాబాద్ కు సెంట్రల్ టీం ఎందుకు వస్తోంది?
X
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటానికి ముందే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కరోనా విషయంలో కేర్ ఫుల్ గా ఉన్నప్పటికి హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారితోనూ.. తర్వాతి కాలంలో మర్కజ్ లింకుతోనూ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలోని పెద్ద నగరాల్లోని ఆరింటిలో (హైదరాబాద్.. చెన్నై.. ఠాణే.. అహ్మదాబాద్.. సూరత్) కేంద్ర ఆరోగ్య శాఖకుసంబంధించిన అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయి. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలు.. లాక్ డౌన్ అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించటం తో పాటు.. ఏవైనా లోపాలు గుర్తిస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు.. సూచనలు ఇచ్చేందుకు వీలుగా ఈ టీములు వస్తున్నాయి.

కేంద్రం ఏర్పాటు చేసిన ఈ టీములు ఇప్పటికే మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. పశ్చిమబెంగాల్ లోని ఎంపిక చేసిన జిల్లాల్లో పర్యటించి.. క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కు తాజాగా సెంట్రల్ టీం వస్తోంది. తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 485 కేసులు హైదరాబాద్ లోనే నమోదైన నేపథ్యంలో.. ఎందుకిలా జరుగుతుంది? దాని కారణం ఏమిటి? అన్న అంశాలతో పాటు.. స్థానిక అంశాల మీద మరింత అవగాహన పెరిగేందుకు తాజా పర్యటన పనికి వస్తుందని చెబుతున్నారు.

కేంద్రం నుంచి వస్తున్న బృందం రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేసేందుకే తప్పించి.. పర్యవేక్షణ కోసం కాదని కేంద్రమంత్రి హర్షవర్ధన్ పేర్కొనటం గమనార్హం. కేసుల నమోదు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా.. అందుకు కారణమైన పరిస్థితుల్ని గుర్తించటం తో పాటు.. కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని అంశాల్ని రాష్ట్రాలకు చెప్పేందుకు తాజా పర్యటన దోహదం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.