Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేసులు ఎందుకు పెట్టలేదు: హైకోర్టు

By:  Tupaki Desk   |   8 Oct 2020 9:35 AM GMT
వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేసులు ఎందుకు పెట్టలేదు: హైకోర్టు
X
ఏపీ హైకోర్టు తీర్పులపై అప్పట్లో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారం సైతం హైకోర్టు తీర్పులపై కామెంట్ చేశాడు. ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యి కేసులు పెట్టమని ఆదేశించినా అవి నమోదు కాలేదు.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై రిజిస్ట్రార్ ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

నేతలను రక్షించేందుకే కేసు పెట్టలేదా అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో సీఐడీ విఫలమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామంది. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది.

అటు స్పీకర్ తమ్మినేని ఎక్కడ నుంచి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రభుత్వ లాయర్ ను కోరింది.