Begin typing your search above and press return to search.
జీహెచ్ఎంసీలో బాబు, లోకేష్, బాలయ్య ఎందుకు కనిపించట్లేదు?
By: Tupaki Desk | 26 Nov 2020 6:26 PM GMTతెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఎన్నికల్లో ప్రతిసారి టీడీపీ అధినేత చంద్రబాబు సందడి కనిపించేది. ఆయనతోపాటు సుపుత్రుడు లోకేష్, బావమరిది బాలయ్యబాబూ సందడి కనిపించేది. తెలంగాణ, ఏపీలో ఏ ఎన్నిక అయినా బాబు కాలు పెట్టని చోటు లేదు. అయితే ఈసారి డిఫెరెంట్. తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నిక జీహెచ్ఎంసీలో అగ్ర నేతలు రంగంలోకి దిగి సెగలు పుట్టిస్తున్న వేళ చంద్రబాబు, టీడీపీ బ్యాచ్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ చంద్రబాబు టీడీపీ తరపున హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించేవారు. కానీ, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రం వారు దూరంగా ఉండడం సంచలనంగా మారింది.
పోయిన సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబు కామెంట్స్ తో హీట్ పుట్టించారు. బాలయ్య ‘హంబుల్ బుల్’ డైలాగ్ గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వైరల్ అయ్యింది కూడా. ఇప్పుడు కూడా టీడీపీ పోటీచేస్తున్నా ఈ ముగ్గురు అటువైపు తిరిగి చూడడం లేదు. తెలంగాణ టీడీపీ నేతలకే మొత్తం అప్పగించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
తెలంగాణలో ప్రచారం చేసి రేపు ఫలితాల్లో ఓట్ల శాతం దారుణంగా ఉంటే ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభావం పడుతుందనే చంద్రబాబు అండ్ కో దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతసారి కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకొని పోయినందుకు ఏపీలో టీడీపీ ఓడిపోయింది. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో బాబు జతకట్టడాన్ని ఏపీ వాసులు జీర్ణించుకోలేదు. అందుకే ఈసారి పొత్తులు, పోటీ, ప్రచారంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదని తెలుస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ బ్యాచ్ వేలు పెట్టలేదని అర్థమవుతోంది.