Begin typing your search above and press return to search.

‘మోదీని విమర్శిస్తావా? జాగ్రత్త బిడ్డా’.. కాంగ్రెస్​ నేతకు బెదిరింపు కాల్​..!

By:  Tupaki Desk   |   9 Feb 2021 5:01 AM GMT
‘మోదీని విమర్శిస్తావా? జాగ్రత్త బిడ్డా’.. కాంగ్రెస్​ నేతకు బెదిరింపు కాల్​..!
X
కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున్​ ఖర్గే ఇటీవల రైతు సమస్యలపై గట్టిగా గళం విప్పుతున్నారు. ఆయన రాజ్యసభలో నేరుగా ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఖర్గే ఏమన్నారంటే.. ‘రైతులు గ్రాడ్యుయేట్లు, సైంటిస్టుల ను కూడా కేంద్రం పెడచెవిన పెడుతున్నది. మమ్మల్ని ఫూల్స్​ అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు.

అనంతరం ఖర్గే ఢిల్లీలోని విజయ్​చౌక్​ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘రైతు సమస్యలపై ప్రధాని ఏమన్నా స్పందిస్తారేమోనని భావించా. కానీ ఆయన ప్రసంగంలో విషయం లేదు. రైతు సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదు. దాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అందరినీ మోసం చేస్తున్నారు.రైతులు, దేశప్రజలు ఎంతో కాలం మోసపోరు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఆ తర్వాత మల్లికార్జున్​ ఖర్గేకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​చేశారు. ఇంకోసారి ప్రధాని మోదీని విమర్శిస్తే బాగుండదంటూ హెచ్చరించారట. ఈ విషయాన్ని కాంగ్రెస్​ నేతలు, ఖర్గే మీడియాకు తెలిపారు. ప్రధానిపై విమర్శలు చేస్తే బెదిరించడం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

విమర్శలకు సమాధానాలు లేక బీజేపీ ఇటువంటి చర్యలకు పూనుకుంటుందని వాళ్లు అంటున్నారు.అయితే ఈ అంశంపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కొంతకాలం రైతు సమస్యలపై కాంగ్రెస్​ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. పార్లమెంట్​లో పార్లమెంట్​ వెలుపల కాంగ్రెస్​ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. బీజేపీ సర్కార్​ రైతులను తీవ్రంగా వంచిస్తున్నదని వాళ్లు మండిపడుతున్నారు.