Begin typing your search above and press return to search.
ఏకాంతం ఆవిరి అవుతోంది.. అలెర్ట్ గా ఉన్నారా? ఇప్పటికే బుక్ అయ్యారా?
By: Tupaki Desk | 22 March 2020 3:58 AM GMTమారిన కాలానికి తగ్గట్లు.. బంధాలు.. అనుబంధాల అర్థం అంతకంతకూ మారిపోతోంది. ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించిన ‘‘మై స్పేస్’’ అనే పదం ఇప్పుడు చాలా కామన్ గా మారటమే కాదు.. పరస్పర గౌరవానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇంతకు మించిన దరిద్రం ఇంకేమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వ్యక్తుల జీవితాల్లోకి సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటివి దూసుకురావటమే కాదు.. అవి రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. అన్ని ఉన్నా.. ఏదో లేదన్న భావనకు గురి చేయటంలో సోషల్ మీడియాకు మించినవి లేవనే చెప్పాలి.
ఇప్పుడీ మధ్య కాలంలో చాలామందిలో ఇలాంటి కొరత తమకు ఉన్నట్లుగా వారి మాటల్లో వినిపిస్తోంది. ఇప్పుడు చాలామందికి ఉన్న అతి పెద్ద సమస్యలు ఏమిటో తెలుసా? సోషల్ మీడియాలో తాము పెట్టే పోస్టులకు స్పందన పెద్దగా లేదని.. మిగిలిన వారితో పోలిస్తే.. వాట్సాప్ చాలా తక్కువగా వాడేస్తున్నామని.. కొందరిలా తమకు రోజులో టన్నుల కొద్దీ మెసేజ్ లు.. పోస్టులు రావటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేసే వారు లేకపోలేదు.
సోషల్ మీడియా పిశాచి ఒక్కసారి పడితే చాలు.. దాని బారి నుంచి తప్పించుకోవటం చాలా కష్టమన్న విషయాన్ని చాలామంది గుర్తించటం లేదు. సోషల్ మీడియా.. వాట్సాప్.. టిక్ టాక్ లాంటి మాథ్యమాలు మనిషి జీవితంలోకి వచ్చాక.. ఏకాంతం అన్నది లేకుండా పోయింది. అనుక్షణం ఎవరికి వారు.. వారి చేతుల్లోని సెల్ ఫోన్లతో కాలం గడపటం పెరిగిపోయింది. దీనికారణంగా భార్యభర్తల రిలేషన్ లోనే కాదు.. అన్నాచెల్లెలు.. అక్కాచెల్లులు.. స్నేహితులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిలేషన్ల మధ్య అర్థం మారిపోయింది.
కాస్త ఖాళీ దొరికితే.. స్టేటస్ చెక్ చేసే స్థాయి నుంచి.. కాసేపటికి ఒకసారి.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవటంలోనూ.. చెక్ చేసుకోవటం మీదనే ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్త పరిచయాలు పెరగటమే కాదు.. అనారోగ్య వాతావరణానికి అవకాశం ఇచ్చేలా చేస్తుందని చెప్పక తప్పదు. అనుక్షణం తనదైన ప్రపంచంలో మునిగిపోయిన భాగస్వామిని చూసి ఒళ్లు మండిపోయేటోళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. చాలా కాపురాల్లో సోషల్ నిప్పులు పడటమే కాదు.. వారి ఏకాంత బంధానికి చిరుగులు పట్టేస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికైనా సరే.. మీ ఏకాంతం తాళాల్ని సోషల్ మీడియాకు అప్పజెప్పేశారా? మీ చేతిలోనే ఉంచుకున్నారా? అన్న విషయాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లెక్క తేడా కొడుతుంటే మాత్రం.. ప్రధాని మోడీ ఎలా అయితే జనతా కర్ఫ్యూ విధించి కరోనా విషయాన్ని అంతో ఇంతో కంట్రోల్ చేయాలని తపిస్తున్నట్లే.. మీ ఇంట్లోనే సెల్ ఫోన్ల వినియోగం స్థాయి దాటితే మాత్రం.. సోషల్ కర్ఫ్యూ విధించుకోవటం తప్పేం కాదు. లేకుంటే.. బంధాలు మరింత బలహీనం కావటమే కాదు.. అనవసరమైన నష్టాన్ని కలిగిస్తాయన్నది మర్చిపోవద్దు.