Begin typing your search above and press return to search.

మగవాళ్లు కండోమ్ అడగడానికి ఎందుకు సిగ్గుపడతారు?

By:  Tupaki Desk   |   23 May 2023 8:00 AM GMT
మగవాళ్లు కండోమ్ అడగడానికి ఎందుకు సిగ్గుపడతారు?
X
ఎర్ర త్రికోణం యాడ్ మీకు గుర్తుందా.. 'మేమిద్దరం.. మాకిద్దరు, చిన్న కుటుంబం.. చింత లేని కుటుంబం, ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు.. అంతకు మించి వద్దే వద్దు' ఇలాంటి ప్రకటనలు మీకు గుర్తున్నాయా..! భారత జనాభా విపరీతంగా పెరిగిపోతున్న రోజులవి. బిడ్డకీ బిడ్డకీ మధ్య ఎడం లేకపోవడంతో పిల్లలు, బాలింతలు పోషకాహారంతో బక్కచిక్కిన పోతున్న తరుణమది. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కుటుంబ నియంత్రణ ప్రత్యేక విభాగం. ఈ వ్యవస్థ తన పని తాను సమర్థవంతంగా చేసేందుకు ఏకైక మార్గం ప్రజలకు కండోమ్‌ని అలవాటు చేయడం. మరి ప్రభుత్వం ఏం చేసింది..?

అది 1950వ సంవత్సరం. కండోమ్‌ అనే పేరు పలకాలంటేనే సిగ్గు పడే రోజుల్లో ఎలా అవగాహన కల్పించారు. సెక్స్‌పై జోకులు వేసుకుంటారు. బూతులు మాట్లాడతారు. కానీ కండోమ్‌ అని మాత్రం మెల్లగా పలుకుతారు. ఈ అపోహను, సిగ్గును తొలగించాలి. కండోమ్‌ గురించి బాగా ప్రచారం చేయాలి. ఇందుకు కుటుంబ నియంత్రణ సంస్థ వద్ద ఉన్న ఏకైక ఆలోచన యాడ్స్‌(ప్రకటనలు). అప్పట్లో ప్రజలు ప్రకటనలను బాగా ఆదరించేవారు. వారిని పాటించేందుకు కూడా ఇష్టపడేవారు. దీంతో ప్రకటనల ద్వారా ముందుకు వెళ్లింది ప్రభుత్వం.

పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌ కండోమ్‌ అనడానికి సిగ్గుపడతాడు. దీంతో అతనితో కండోమ్‌ అని పలికించేందుకు తోటి పోలీసులు ప్రయత్నించి చివరికి అతని నోటే చెప్పిస్తారు. సిగ్గుపడకుండా హాయిగా నోరు తెరిచి అందరూ కండోమ్‌ అని చెప్పండి అంటూ 'కండోమ్‌' అని గట్టిగా అరుస్తారు. అలాగే కోర్టు బయట లాయర్ల, కూలీల మధ్య జరిగే సంభాషణలతో మరికొన్ని యాడ్స్‌ ఉంటాయి. ఈ సిరీస్‌ బాగా పాపులర్‌ అయిందంటే దీనికి ఐరాస అవార్డు కూడా వచ్చింది. దీన్ని బట్టి యాడ్‌ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఇండియాలో కుటుంబ నియంత్రణ కోసం, కండోమ్‌ వాడకం పెంచడం కోసం ఎన్నో హాస్యభరిత యాడ్స్‌ వచ్చాయి. సరదాగా నవ్వించడమే కాకుండా స్త్రీపురుషుల సమస్య కూడా అవగాహన కల్పించేలా చేశాయి. తిరగేసిన ఎరుపు రంగు త్రిభుజాకారం గుర్తు కూడా కుటుంబ నియంత్రణకు సూచికగా ఏర్పాటు చేసేవారు. ఏనుగులపై బ్యానర్లు ప్రదర్శించడం ద్వారా కూడా కండోమ్‌ వాడకాన్ని చక్కగా వివరించారు.

ఇక 2008కి వచ్చే సరికి మాత్రం కండోమ్‌ ప్రచారం మరోరకంగా సాగింది. కండోమ్‌ ప్రచారంలో అన్నింటికంటే ఆదరణ పొందింది 'కండోమ్‌ కండోమ్‌ కండోమ్‌' అంటూ వచ్చిన రింగ్‌టోన్‌. దీనిపై ఓ యాడ్‌ కూడా వచ్చింది. ఓ పెళ్లిలో ఒక వ్యక్తి జేబులో సెల్‌ఫోన్‌ మోగుతుంది. కండోమ్‌ కండోమ్‌ అంటూ.. దాంతో అతను గాబరపడతారు. ఈ రింగ్‌టోన్‌ ఎంత వైరల్‌ అయిందంటే డౌన్‌లోడ్‌ కోసం 4800000 రిక్వెస్టులు వచ్చాయి. అమెరికా, జపాన్‌, ఇండోనేషియా, దక్షిణ అమెరికా, యూరప్‌లో కూడా ఈ పాపులర్‌ మ్యూజిక్‌లో ఈ రింగ్‌టోన్‌ వాయించారు. ఏదేమైనా భారతదేశంలో కుటుంబ నియంత్రణను అప్పటి ప్రభుత్వం ఒక సంకల్పంగా తీసుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు.