Begin typing your search above and press return to search.
ఈటెల మాటలు ఎందుకంత హాట్ టాపిక్ గా మారుతున్నాయ్?
By: Tupaki Desk | 5 Feb 2021 2:30 PM GMTచెప్పే మాటకు చేసే పనికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉండటం రాజకీయ నాయకుడి ప్రధమ లక్షణంగా చెబుతారు. అలాంటిది ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాల్లోఉండి.. ఉద్యమ జీవితంలో ప్రముఖుడిగా మన్ననలు పొందిన మంత్రి ఈటెల రాజేందర్ లాంటి వారి మాటలు సూటిగా.. సాఫీగా ఎందుకు ఉంటాయి? ఏ నోటితో అయితే పొగిడారో.. అదే నోటి నుంచి వస్తున్న వరుస వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు అవునన్నా.. కాదన్నా కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో అవకాశం వచ్చినప్పుడల్లా కేటీఆర్ పట్ల తమకున్న విధేయతను ప్రదర్శిస్తున్నారు పలువురు టీఆర్ఎస్ నేతలు. వీరిలో భిన్నంగా వ్యవహరిస్తున్నది ఈటెల రాజేందర్ ఒక్కరే. ఆసక్తికరంగా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? అంటూ ప్రశ్న వేసి.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పోస్టు కట్టబెట్టాలన్న వాదనను తీసుకొచ్చింది మంత్రి ఈటెల. కేటీఆర్ సీఎం కావటానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న వ్యాఖ్య చేయటం ద్వారా.. కొత్త చర్చకు తెర మీదకు తెచ్చిన ఆయన.. ఆ తర్వాత నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అంతేకాదు.. ఆయన పాల్గొన్న సభలో కొందరు వక్తలు మాట్లాడుతూ.. ఈటెలను ముఖ్యమంత్రి చేయాలన్న మాటను వినిపించటం.. దాన్ని ఈటెల సుతిమెత్తగా అడ్డుకోవటం జరుగుతోంది. అదే సమయంలో వ్యవసాయం మీదా.. రైతుల మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమకు పదవులు ఉన్నా లేకున్నా.. తాను.. కేసీఆర్ రైతుల కోసం.. రైతుల సంక్షేమం కోసం పోరాడతామన్న వ్యాఖ్యలు చేశారు.
పార్టీలు.. జెండాలు ఉండకపోయినా ప్రజల పక్షాన తాను ఉంటానని చెప్పిన ఈటెల.. తరచూ రైతులను అడ్డుపెట్టుకొని ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దికాలం క్రితం టీఆర్ఎస్ కు ఓనర్లం తామేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటెల.. తర్వాతి కాలంలో సైలెంట్ గా ఉన్నారు. కేటీఆర్ ను సీఎం చేసే అంశంపై టీఆర్ఎస్ లో అంతర్లీనంగా అభ్యంతరాలు వ్యక్తం చేసే వారు పలువురు ఉన్నారు. కానీ.. కేసీఆర్ నిర్ణయానికి అడ్డు చెప్పే ధైర్యం.. సాహసం ఎవరూ చేయలేరు.
ఈ నేపథ్యంలో ఈటెల నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? అన్న నోటితోనే.. రైతుల పేరుతో ఈటెల చేస్తున్న వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన టీఆర్ఎస్ నేతలకు భిన్నంగా ఉన్న ఈటెల మాటలు.. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలకు అవకాశం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.