Begin typing your search above and press return to search.

అర్రే.. ఐపీఎల్లో ఒక్కో ప్లేయర్ తలపై రెండేసి టోపీలు.. చూశారా!

By:  Tupaki Desk   |   23 Oct 2020 9:30 AM GMT
అర్రే.. ఐపీఎల్లో ఒక్కో ప్లేయర్ తలపై రెండేసి టోపీలు.. చూశారా!
X
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్లో ఈసారి క్రికెటర్లు మైదానంలో రెండేసి టోపీలు ధరించి కనిపిస్తుండటం ఆసక్తిగొలుపుతోంది. ఒక ఆటగాడు రెండేసి టోపీలు ఎందుకు పెట్టుకుంటున్నారా.. అని అభిమానులు ఆరా తీస్తున్నారు. క్రికెట్ ఆడే సమయంలో మైదానంలో క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్టయిల్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరించినప్పటికీ స్టయిల్ మాత్రం వ్యత్యాసం ప్రదర్శిస్తుంటారు. ఫేస్ పై తెల్లటి రంగు వేస్తుంటారు.తలపై టోపీ ధరించే క్రికెటర్లు స్టైలిష్ గాగుల్స్ పెడుతుంటారు. ఒక్కోసారి ఆ గాగుల్స్ తీసి టోపీపై పెడుతుంటారు. సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అయ్యేవారు మైదానంలో ఉన్నప్పుడల్లా ఏ దారాలో..వస్తువులో జేబులో పెట్టుకుంటూ ఉంటారు.

వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చేసే సమయంలో తలపై ప్రత్యేక మైన క్లాత్ చుట్టుకునేవాడు. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీకి కూడా నమ్మకాలు ఎక్కువ. వారు కూడా బ్యాటింగ్ చేసే సమయంలో దేవుళ్లకు సంబంధించిన వస్తువులను తమ ప్యాంట్ జేబుల్లో పెట్టుకునేవారు. అలా ఆటగాళ్లు తమ వద్ద పెట్టుకున్న వస్తువులను ఒక్కోసారి అంపైర్ ల వద్ద ఇస్తుంటారు. బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో, బ్యాట్స్ మెన్లు స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే సమయంలో తమ వద్ద ఉన్న వస్తువులు తీసి అంపైర్లకు ఇవ్వడం మామూలే. అయితే ఈ ఐపీఎల్ టోర్నీలో ఆటగాళ్లు తమ వద్ద ఉండే వస్తువులను ఇతరులకు ఇవ్వవద్దని నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో ఆటగాళ్ళు తమ వద్ద ఉన్న టోపీలు ఇతర వస్తువులను సహచర ఆటగాళ్లకు ఇస్తున్నారు. దీంతో ఒక్కోసారి ఆటగాళ్ళు రెండేసి టోపీలు ధరించి మైదానంలో కనిపిస్తున్నారు. ఆటగాళ్లు రెండేసి టోపీలు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలిసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.