Begin typing your search above and press return to search.

వాస్తు భయం.. భయపడుతున్న డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   2 Jan 2020 7:03 AM GMT
వాస్తు భయం.. భయపడుతున్న డిప్యూటీ సీఎం
X
వాస్తు భయం తో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్నికైన అజిత్ పవార్.. తనకు మహారాష్ట్ర సచివాలయంలో కేటాయించిన విశాలమైన ఆధునిక 602 చాంబర్ ను వద్దే వద్దంటున్నారు. ఆ చాంబర్ లో కూర్చున్న నేతలంతా పదవీ గండానికి గురికావడంతో తనను మార్చాలంటూ వేడుకుంటున్నారట..

మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయం’లో 6వ అంతస్తు లో ముఖ్యమంత్రి చాంబర్ తోపాటు ఉప ముఖ్యమంత్రి చాంబర్ 602 లు ఉన్నాయి. కీలకమైన ఈ ఇద్దరు మంత్రుల చాంబర్లు చాలా విశాలంగా.. ఆధునికంగా ఉన్నాయి.

అయితే 602 చాంబర్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఇచ్చారు. ఇదివరకూ ఆ చాంబర్ లో గత ప్రభుత్వంలో ఏక్ నాథ్ ఖడ్సె రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన భూస్కాంలో ఇరుక్కొని పదవి కోల్పోయారు. ఇక ఆ తర్వాత వ్యవసాయ శాఖమంత్రి భావుసాహెబ్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే మరణించారు. ఆ తర్వాత బీజేపీ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అనిల్ బోర్డే బాధ్యతలు చేపట్టి అనంతరం కొద్దినెలలకే ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

దీంతో ఈ 602 చాంబర్ అంటేనే డిప్యూటీ సీఎంగా నియామకమైన అజిత్ పవార్ హడలి చస్తున్నాడు. ఆ చాంబర్ లో బాధ్యతలు చేపట్టిన వారు ఎక్కువ కాలం కొనసాగ లేకపోయారు. అచ్చిరాని ఆ చాంబర్ వద్దని.. సాధారణ పరిపాలన విభాగం ప్రధాన కార్యదర్శి సీతారం కుంటే చాంబర్ కావాలని కోరాడట.. ఇదీ ఈ వాస్తు భయంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భయపడుతున్న పరిస్థితి.