Begin typing your search above and press return to search.

సర్జికల్స్ స్ట్రైక్-2లో మిరాజ్ నే ఎందుకు వాడారు?

By:  Tupaki Desk   |   26 Feb 2019 7:01 AM GMT
సర్జికల్స్ స్ట్రైక్-2లో మిరాజ్ నే ఎందుకు వాడారు?
X
పుల్వామా దాడి తర్వాత దేశం మొత్తం రగిలిపోయింది. దీంతో కేంద్రం కూడా భారత సైన్యానికి స్వేచ్చనిచ్చింది. ఉగ్రదాడులకు ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ పై ప్రతీకారం ఖాయమయే అంచనాలు వచ్చాయి. మంగళవారం ఉదయం 3.30 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడిచేశాయి. ఈ దాడిలో జేషే మహ్మద్ కు చెందిన 200మంది ఉగ్రవాదులు మృతిచెంది ఉంటారని సమాచారం.

ఈసారి సర్జికల్స్-2లో భారత ఎయిర్స్ రంగంలోకి దిగడం విశేషంగా చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఎయిర్స్ మిరజ్-2000 యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టి సేఫ్ గా తిరిగొచ్చాయి. దీంతో మిరాజ్-2000 యుద్ధ విమానాల ప్రత్యేకతపైనే ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతుంది.

మిరాజ్ యుద్ధ విమానాలకు సంబంధించి చరిత్ర చూస్తే వీటిని ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. 1970లో తొలిసారి మిరాజ్ విమానాలు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్సులో సేవలందించాయి. కాగా భారత్ చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానాలు సింగిల్ సీటర్ - టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లు ఉన్నాయి. ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్ సెప్ట్ - వార్ మిస్సైల్స్ - మ్యాజిక్-2 మిస్సైల్స్ ను మిరాజ్ యుద్ధవిమానాలు మోసుకెళ్లగలవు.

ప్రస్తుతం పాక్ పై దాడిలో మాత్రమే కాకుండా ఈ యుద్ధవిమానాలు గతంలో కార్గిల్ వార్లో కూడా కీలక పాత్ర పోషించాయి. కార్గిల్ వార్ సమయంలో శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి త్రివర్ణ పతకం రెపరెపలాడటంలో మిరాజ్-2000 విమానాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఇంతటీ ఘన చరిత్రతోపాటు మిరాజ్ యుద్ధవిమానాలపై వాయుసేనకు ఉన్న నమ్మకంతో సర్జికల్స్ స్ట్రైక్-2లో వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఏదిఏమైనా భారత జవానులపై దాడికి పాల్పడితే సహించేదిలేదని ఈ దాడితో భారత్ స్పష్టం చేస్తుంది. ఉగ్రవాదులను ఎరివేసేందుకు ఎంత దూరం వెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ దాడితో భారత్ హెచ్చరికలు పంపింది.