Begin typing your search above and press return to search.
ట్రంప్.. బైడెన్ మధ్య జరిగిన తాజా డిబేట్ లో ఎవరిది పైచేయి?
By: Tupaki Desk | 24 Oct 2020 10:45 AM ISTసందేహాలు తీరాయి. జరుగుతుందా? లేదా? అన్న సందేహాల్ని పక్కన పెట్టేసి మలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ డిబేట్.. మొదటి డిబేట్ కంటే బాగా జరిగినట్లుగా చెబుతున్నారు. తొలి డిబేట్ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ట్రంప్.. బైడెన్ లు తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే.. ఈసారి మాత్రం అలాంటిది తక్కువనే చెప్పాలి. పలు అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాల్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూనే.. ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు.
అభ్యర్థుల మైక్ ను మ్యూట్ చేసే కొత్త ఆప్షన్.. వారిని కంట్రోల్ చేసిందన్న మాట వినిపిస్తోంది. నాష్ విల్లేలోని బెల్మాట్ వర్సిటీలో జరిగిన ఈ డిబేట్ కు ఎన్ బీసీ న్యూస్ కు చెందిన క్రిస్టిన్ వెల్ కర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.తనను.. తన విధానాల్ని తప్పు పట్టే వారిని ఏ మాత్రం వదలకుండా తీవ్రంగా ఉతికి ఆరేసే అలవాటు ఉన్న ట్రంప్.. ఈసారి తన తీరును మార్చుకున్నారు. మొదటి డిబేట్ తో పోల్చినప్పుడు హుందాగా వ్యవహరించారు.
వ్యాఖ్యాతగా వ్యవహరించిన క్రిస్టిన్ పై గతంలో ట్రంప్ నోరు పారేసుకునేవారు. ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. అందుకు భిన్నంగా డిబేట్ ముగిసిన తర్వాత క్రిస్టిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.డిబేట్ ను చక్కగా నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వివిధ అంశాలపై సాగిన డిబేట్ పోటాపోటీగా సాగిందని.. అభ్యర్థులు ఇద్దరికి సమానంగా మార్కులు పడినట్లుగా చెబుతున్నారు.
ఎవరు ఎవరిపైనా పైచేయి సాధించలేదన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే.. దీనిపై నిర్వహించిన సర్వేలో మాత్రం ట్రంప్ కంటే బైడెన్ కాస్తంత పైచేయి సాధించినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ బాగా మాట్లాడినట్లుగా 47 శాతం మంది పేర్కొంటే.. బైడెన్ వాదనకు అనుకూలంగా 53 శాతం మంది ఓటేశారు. దీంతో.. ట్రంప్ కంటే బైడెన్ కాస్త ముందంజలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.