Begin typing your search above and press return to search.

ఆపరేషన్ గరుడ ఛీప్ అమెరికాకు పారిపోయాడా?

By:  Tupaki Desk   |   28 Oct 2018 8:52 AM GMT
ఆపరేషన్ గరుడ ఛీప్ అమెరికాకు పారిపోయాడా?
X
ఆపరేషన్ గరుడ అంటూ కథలు అల్లి.. తమ రాజకీయా అజెండాను అమలు చేసిన వ్యక్తులు ఇప్పుడు అడ్రస్ కనిపించడం లేదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆపరేషన్ గరుడ నిజమేనేమో అని అంటున్నారు. జగన్ మీద అటాక్ గురించి మాట్లాడమంటే వీళ్లు రెండురకాలుగా మాట్లాడుతున్నారు. ముందుగా..ఈ అటాక్ ను జగనే చేయించుకున్నాడని, తర్వాతేమో కేంద్ర ప్రభుత్వ కుట్ర అని ఆపరేషన్ గరుడ అని అంటున్నారు. అయితే అధికారంలో ఉన్న వారు ఏదో ఒకటి అనేస్తే సరిపోదు. అసలు కథలను తేల్చాలి. విచారణలు చేయించాలి.

ఒకవేళ జగన్ మీద జగనే అటాక్ చేయించుకున్నట్టు అయితే ఆ విషయాన్ని అయినా నిరూపించాలి. కానీ ప్రభుత్వం నుంచి అలాంటి చర్యలు ఏమీ లేవు. ఏదో నోటి మాటలే మాట్లాడుతున్నారు. ఎవరైనా నిగ్గదీసి అడిగితే మాత్రం సమాధానాలు లేవు. ఇక ఆపరేషన్ గరుడ నిజమేనేమో అనేది రెండో మాట. అయితే దీన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

అసలు ఆ శివాజీ ఎవరు? అతడికి ఉన్న రాజకీయ నేపథ్యం ఏమిటి? అతడికి దీని గురించి ఎవరు చెప్పారు? అతడు చెప్పినవే ఎలా జరిగాయి? అనే అంశాల గురించి విచారణ చేయాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇంత పెద్ద కుట్ర జరుగుతోందని అంటున్నారు.. కానీ ఆ కుట్ర ను పూర్తిగా బయట పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు. దీంతోనే ఈ ఇదంతా టీడీపీ స్పాన్సర్డ్ వ్యవహారం అనే అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయడు ఆపరేషన్ గరుడ అన్నాడు కానీ.. దాని వివరాలను బయటకు తీస్తామని చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి బాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని స్పష్టం అవుతోంది.

ఆ సంగతలా ఉంటే..ఇప్పుడు ఆపరేషన్ గరుడ కుట్రదారులు అంతా దేశం దాటారని సమాచారం. ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఏదైనా విచారణను ఎదుర్కొనాల్సి వస్తుందేమో అనే భయంతో దీని కథ - స్క్రీన్ ప్లే - దర్శకులు అంతా అమెరికా చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి.