Begin typing your search above and press return to search.
ఎన్నికల్లో ఎవరు జోక్యం చేసుకున్న మూల్యం చెల్లించుకోవాల్సిందే : బిడెన్
By: Tupaki Desk | 23 Oct 2020 7:10 AM GMTఅమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. మళ్లీ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని ట్రంప్ , ఈసారి ఎలాగైనా గెలవాలని బిడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ట్రంప్, జో బిడెన్ మధ్య మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. నాష్ విల్లేలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా, దేశమైనా అమెరికా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నా అని బిడెన్ చెప్పారు.
కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, చైనాకి రాకపోకలు నిషేధించడంపై ట్రంప్ ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. కరోనా మరణాలకు కారణమైన వారు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని బిడెన్ ధ్వజమెత్తారు. తనను అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకోవాలో దేశ ప్రజలకు బాగా తెలుసని బిడెన్ తెలిపారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అనూహ్య విజయం వెనుక రష్యా ప్రమేయం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని రష్యా గూఢచారి సంస్థ పేర్కొంది.
తాజాగా... అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీనినే చెప్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటూనే ఉందని పేర్కొంది. అమెరికా అధ్యక్స పదవి కోసం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా రష్యా విభిన్న రకాల పద్ధతులను వినియోగిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిడెన్ ప్రపంచ దేశాలకి తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే ఇదే సమావేశంలో బైడన్‌పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా నుంచి బైడన్ కు మిలియన్ డాలర్ల సాయం అందుతోందని ట్రంప్ ఆరోపించారు. తన జీవితంలో ఏ దేశం నుంచీ ఒక్క డాలర్ కూడా తీసుకోలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. తనకు వ్యాపారాలున్నాయని, మిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ డిబేట్ లో చెప్పుకొచ్చారు.