Begin typing your search above and press return to search.
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?
By: Tupaki Desk | 5 Jan 2021 2:30 PM GMTతెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఇప్పుడు కమలదళం టార్గెట్ ఏపీనే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ మధ్య ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేస్తుండడంతో బీజేపీ ఫుల్ ఫోకస్ ఏపీపై పెట్టిందని అర్థమవుతోంది. మరి ఇటు బీజేపీ.. అటు ప్రతిపక్షం టీడీపీ బలంగా నిలబడుతున్న వేళ అధికార పార్టీ వైసీపీకి తిరుపతి ఉప ఎన్నికల్లో షాక్ తగులుతుందా? అసలు రిజల్ట్ ఏమవుతుంది? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..
నిజానికి తెలంగాణ ఏర్పడ్డ ఆరున్నర ఏళ్లలో ఒక్క ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోలేదు. ట్రబుల్ షూటర్ హరీష్ దుబ్బాక రంగంలోకి దిగినా.. కేటీఆర్ జీహెచ్ఎంసీలో ప్రచారం చేసినా తాజాగా ఓడిపోయింది. బీజేపీ సత్తా చాటింది. అదేఊపు ఏపీలోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
అయితే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత పెల్లుబుకుతోందన్నది కాదనలేని సత్యం.. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్య, తదితర విషయాల్లో కేసీఆర్ సర్కార్ పై పీకల్లోతు కోపం ఉంది. ఉద్యోగ ప్రకటనలు అసలే లేవు. అందుకే అక్కడ యువతే బీజేపీని గెలిపించి టీఆర్ఎస్ ను ఓడించారు. తెలంగాణలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం టీఆర్ఎస్ పై వ్యతిరేకతే. ప్రత్యామ్మాయంగా బీజేపీని చూసి గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి కుదేలు కావడంతో ఈ పరిస్థితి దాపురించింది.
అయితే ఏపీలో పరిస్థితి మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. అక్కడ బలమైన ప్రతి పక్షం టీడీపీ ఉంది. ఇక అంతకంటే బలంగా దూసుకొస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే అధికార వైసీపీ కూడా అంతే బలంగా ఉంది. ఏకంగా మొన్ననే 151 మంది ఎమ్మెల్యేలు .. 23 మంది ఎంపీలను గెలుచుకుంది.
తెలంగాణలోని సెంటిమెంట్ ఏపీలోనూ పునరావృతం కావడం లేదని తాజాగా వెల్లడైంది. మా ‘తుపాకీ.కామ్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వే లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
‘తిరుపతి’ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని ‘తుపాకీ.కామ్’ ఆన్ లైన్ సర్వే నిర్వహించగా.. ప్రజల ఓటు వైసీపీ వైపే మొగ్గడం విశేషం. వైసీపీకి ఏకంగా 44.39శాతం ఓట్లు వస్తాయని.. అధికార పార్టీ గెలవడం గ్యారెంటీ అని సర్వేలో తేలింది.
ఇక ప్రతిపక్ష టీడీపీ 24.37 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి పడిపోతుందని ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇక అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్న బీజేపీ-జనసేన కూటమి తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటనుందని తేలింది. బీజేపీ కూటమికి ఏకంగా 27.76శాతం మంది ప్రజలు పట్టం కట్టారు.
ఇక ఎవరు గెలుస్తారో చెప్పలేం అంటూ 3.48శాతం మంది తిరుపతి ఉప ఎన్నికను ఊహించలేకపోయారు. దీన్ని బట్టి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని తోసిరాజని బీజేపీ-జనసేన కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని.. టీడీపీ కంటే బీజేపీ కూటమికే ఎక్కువ ఓట్లు పడుతాయని తుపాకీ ఆన్ లైన్ సర్వే లో తేలింది.