Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ సొంత ఊరిలో ఎవరు గెలిచారంటే.
By: Tupaki Desk | 10 Feb 2021 5:42 AM GMTఏపీ సర్కార్ తో ఢీ అంటే అంటున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా జగన్ తో ఫైట్ లో రచ్చ గెలిచినా ఇంట మాత్రం ఓడిపోయారు. జగన్ పై నైతిక విజయం సాధించినా తన సొంత ఊరిలో ఓడిపోవడం విశేషం. పంచాయతీ ఫైట్ లో నిమ్మగడ్డ సొంత ఊరును వైసీపీ కైవసం చేసుకుంది.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సొంత ఊరిలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో సర్పంచ్, ఆయన నివాసం ఉన్న వార్డులో వైసీపీ అభిమానులు విజయం సాధించడం విశేషం.
సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిమ్మగడ్డ సొంత వార్డులో ఆత్మకూరు నాగేశ్వరావు 111 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీవారే కావడం గమనార్హం.
నిజానికి రాజకీయాలతో నిమ్మగడ్డకు ఎటువంటి సంబంధం లేకున్నా.. ఆయన వైసీపీ సర్కార్ తో పోరాడుతుండడంతో ఈ గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. నిమ్మగడ్డను సొంతఊరిలో ఓడించామన్న సంతృప్తి వైసీపీకి దక్కింది.