Begin typing your search above and press return to search.

కర్ణాటకలో గెలుపెవరిది? ముఖ్యమంత్రి ఎవరు?

By:  Tupaki Desk   |   13 April 2023 5:14 PM GMT
కర్ణాటకలో గెలుపెవరిది? ముఖ్యమంత్రి ఎవరు?
X
కర్ణాటక ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఇక్కడ గెలవకపోతే ఇక దక్షిణాది మొత్తం మీద బీజేపీ చాపచుట్టేసినట్టే. అందుకే కర్ణాటకలో బీజేపీకి గెలుపు అత్యవసరం. ఇక్కడ ఓడిపోతే ఇక దక్షిణాదిలో బీజేపీకి గడ్డుకాలం తప్పదు. అందుకే కర్ణాటకలో అలివికానీ సంచలన హామీలు, రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళుతోంది.దీంతో కర్ణాటకలో ఇప్పుడు గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది.

తాజాగా ‘పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ’ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈసారి ఏ పార్టీకి రావని తేలింది. మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.దీంతో జేడీఎస్ ఇక్కడ కీలకంగా మారడం ఖాయమని అంటున్నారు.

సర్వేలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు హోరా హోరీ పోరాడుతాయని తేలింది. కాంగ్రెస్ కే కొంత మెరుగు ఉంటుందని.. ఇక్కడ గెలువచ్చని చాలా సర్వేలు చెప్పాయి. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు కర్ణాటకలో మంచి ఊపు వచ్చిందని.. ఈసారి మెజార్టీ సీట్లు గెలుస్తుందని అంటున్నారు. సర్వేలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నాయి.

పీపుల్స్ పల్స్ తాజాగా పీపీఎస్ పద్ధతిలో కర్ణాటకలోని 56 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం 5600 శాంపిల్స్ సేకరించింది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంత మొగ్గు ఉన్నట్టు సర్వేలో తేలింది.

ఈ సర్వేలో కాంగ్రెస్ కు 98 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని చెబుతున్నారు. దాదాపు 105 సీట్ల వరకూ రావచ్చని తేల్చారు. ఇక బీజేపీకి 92 స్థానాలు రావచ్చని అంటున్నారు. ఈ సర్వేను బట్టి చూస్తే హోరాహోరీ పోరు తప్పదని అంటున్నారు.

ఇక జేడీఎస్ 27 సీట్లతో కింగ్ మేకర్ గా అవతరిస్తుందని సర్వే తేల్చింది. జేడీఎస్ కు 25-30 సీట్లు రావచ్చని ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వారిదే సీఎం పీఠం.. కర్ణాటకలో అధికారం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సర్వే తేల్చింది. 2018 ఫలితాలే ఇక్కడా పునరావృతం కావడం ఖాయమని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.