Begin typing your search above and press return to search.
రాజధానిలో జెండా పాతేదెవరు?
By: Tupaki Desk | 10 May 2019 4:15 AM GMTదేశాన్ని ఏలే పార్టీ.. దేశ రాజధానిలో గెలువక పోతే అంతకంటే అవమానం లేదు. మరి రాజధాని ఢిల్లీ పరిధిలోని ఏడు పార్లమెంట్ సీట్లపై కూడా అంతే ఫోకస్ ఉంటుంది. ఈసారి ఢిల్లీ పరిధిలో త్రిముఖ పోరు ఎవరికి లాభిస్తుందన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది.
అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్ ఢిల్లీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న ఆమ్ ఆద్మీ కూడా వీటికి పోటీగా రంగంలో ఉంది. ఢిల్లీలో పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. అటు రాష్ట్రానికి తక్కువ.. కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువగా అధికారాలున్నాయి.
నిజానికి ఢిల్లీలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పొత్తుకు సంప్రదింపులు జరిపాయి. కానీ విభేదాలతో ఎవరికి వారు పోటీపడుతున్నారు. ఇదే ఈ రెండు పార్టీలకు పెద్ద మైనస్ కాగా.. బీజేపీ కొండంత బలమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ రెండు పార్టీలు చీల్చితే తమకు లాభమని బీజేపీ యోచిస్తోంది. కాంగ్రెస్-ఆప్ కనుక కలిసి పోటీచేస్తే బీజేపీకి ఇక్కడ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు సైతం కుండబద్దలు కొట్టారు.
ఇక జీఎస్టీ - నోట్ల రద్దుతో వచ్చిన ప్రజా వ్యతిరేకత వల్ల తాము ఎక్కువ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఇక నాలుగేళ్ల పాలనలో తాము చేపట్టిన పనులే తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాసంతో ఉంది.
గత నాలుగు దఫాల ఎన్నికలు పరిశీలిస్తే.. ఢిల్లీలో జెండా ఎగురవేసిన పార్టీలే.. దేశంలో అధికారంలోకి వస్తున్నాయి. 2009 వరకు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపే నడిచిన ఓటర్లు గత సారి మాత్రం ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారు. ఇప్పుడూ ఆ పార్టీ పైనే ఎక్కువగా దృష్టి ఉంది..
2014 ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ పరిధిలో 46శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీలోని మొత్తం ఏడుకు ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆప్ 33శాతం ఓట్లతో రెండో స్థానంలో.. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది.ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 54శాతం ఓట్లతో ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ - కాంగ్రెస్ కుదేలయ్యాయి. గడిచిన నాలుగేళ్లలో కేజ్రీవాల్ విద్యా - వైద్య - మౌళిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దీంతో మెజార్టీ ఢిల్లీ ప్రజలు ఆ పార్టీ వైపే ఉన్నారని సర్వేలు తేలుస్తున్నాయి. అయితే ఢిల్లీలో అత్యధికంగా ఉన్న వ్యాపారులు - ఉద్యోగులు జీఎస్టీ - నోట్లరద్దుతో సతమతమయ్యారు. వారు జాతీయ కోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ కు చాన్స్ ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక పైనే బీజేపీ ఆశలు పెంచుకుంది. మొత్తంగా త్రిముఖ పోరులో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడుతారన్నది వేచిచూడాల్సిందే..