Begin typing your search above and press return to search.
ఈ డౌట్ ను తీర్చేవారెవరు? జైల్లోని పిళ్లై ఎవరు ఎలా కలిశారు?
By: Tupaki Desk | 15 March 2023 11:00 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపిన వైనం తెలిసిందే.
గురువారం మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. గత విచారణకు భిన్నంగా ఈసారి ఆమెను ప్రశ్నలు అడిగే తీరు ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 11న ఆమెను ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నలు సంధించిన ఈడీ.. అనంతరం ఆమెను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపటం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె రేపు (గురువారం) ఈడీ ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ రోజు (బుధవారం) ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపటి విచారణలో ఈ ఉదంతంలో సహ నిందితులుగా భావిస్తున్న అరుణ్ పిళ్లై.. బుచ్చిబాబులతో కలిపి కవితను కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరించిన ఈడీ.. రేపటి విచారణ తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను పలుమార్లు విచారించటం ఒక ఎత్తు అయితే.. ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. తాము ఎమ్మెల్సీ కవితకు బినామీగా పేర్కొన్నట్లుగా బయటకు సమాచారం రావటం తెలిసిందే.
దానికి సంబంధించి అధికారులకు తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కోర్టును ఆశ్రయించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. జైల్లో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై చేత.. వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పిటిషన్ ను తయారు చేయించింది ఎవరు? దాన్ని జైల్లో ఉన్న పిళ్లై వద్దకు తీసుకెళ్లిందెవరు? అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పిన అరుణ్ పిళ్లై.. జైలు నుంచి బయటకు ఆ సమాచారాన్ని ఎలా చేరవేశారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నింటికి మించిన పిళ్లైను కలిసి.. ఆయన చేత పిటిషన్ మీద సంతకం పెట్టించినోళ్లు ఎవరై ఉంటానరన్నది హాట్ టాపిక్ గా మారింది. దర్యాప్తు సంస్థలు సైతం ఇదే అంశంపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. రానునన్న రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు సైతం బయటకు వస్తాయంటున్నారు. అదే జరిగితే.. ఈ కేసులో మరో సంచలనంగా మారనుందంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.